Begin typing your search above and press return to search.

అడ‌వి కాచిన వెన్నెల.. ఎంత ఆర‌బోసినా కానీ!

By:  Tupaki Desk   |   8 July 2021 12:30 AM GMT
అడ‌వి కాచిన వెన్నెల.. ఎంత ఆర‌బోసినా కానీ!
X
అందానికి అందం గుబులు రేకెత్తించే హాట్ నెస్ రాయ్ ల‌క్ష్మీ ప్ర‌త్యేక‌త‌. ద‌క్షిణాది ఉత్త‌రాది అనే డిఫ‌రెన్స్ లేకుండా అన్నిచోట్లా ఈ అమ్మ‌డికి వీరాభిమానులున్నారు. ఇటు తెలుగు-త‌మిళంలో న‌టిస్తూనే అటు హిందీ చిత్ర‌సీమ‌లోనూ కెరీర్ బండి న‌డిపిస్తోంది. ఇంత‌కుముందు జూలీ సీక్వెల్లోనూ రాయ్ ల‌క్ష్మి న‌టించి ఉత్త‌రాదికి రిమ్మ తెగులు పుట్టించింది. రాయ్ ల‌క్ష్మి గ్లామ‌ర్ ఎలివేష‌న్ తో త‌న రేంజును పెంచుకుంది.

ఓవైపు క‌థానాయిక‌గా మ‌రోవైపు ఐటెమ్ భామ‌గానూ పాపుల‌రైంది. తెలుగులో బ‌లుపు- సర్దార్ గబ్బర్ సింగ్- ఖైదీ నెం: 150 సినిమాల్లో ఆమె హిట్ ఐటమ్ నంబర్లతో యువతను అలరించింది. భారీ క్రేజీ సినిమాల్లో న‌టించిక‌పోయినా మీడియం రేంజు సినిమాల‌తో ఇప్ప‌టికీ అభిమానుల‌కు ట‌చ్ లో ఉంది.

తాజాగా రాయ్ లక్ష్మి వైల్డ్ లుక్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఓపెన్ టాప్ బాతింగ్ చేస్తూ ర‌చ్చ ర‌చ్చ చేస్తున్న ఫోటోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. త‌న పాల‌మీగ‌డ చర్మంపై నీటి బిందువులు తూలి ప‌డుతుంటే అది ఎంతో మ‌నోహ‌రంగా క‌నిపిస్తోంది. అడవిలో ప్రశాంతత ఉంది .. ప్రకృతి # జంగిల్ # వైల్డ్ లైఫ్ # అంటూ ఈ ఫోటోకి శీర్షికను ఇచ్చింది. ఈ స్పెష‌ల్ జంగిల్ నేచుర్ ఫోటోషూట్ కి స్పంద‌న అద్భుతం. టూ హాట్ .. పర్ఫెక్ట్ .. బ్యూటిఫుల్ అంటూ అభిమానులు కితాబిచ్చేస్తున్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. రాయ్ లక్ష్మి చివరిసారిగా `మిరుగా` అనే తమిళ చిత్రంలో కనిపించారు. ఇది బాక్సాఫీస్ వద్ద డిజాస్ట‌రైంది. ప్రస్తుతం ప్రొడక్షన్ అనంతర దశలో ఉన్న తన కన్నడ చిత్రం ఝాన్సీ ఐపిఎస్ విడుదల కోసం వేచి చూస్తోంది. ఈ సినిమాల‌తో పాటు ప‌లు చిత్రాల్లోనూ రాయ్ ల‌క్ష్మి న‌టిస్తోంది.