Begin typing your search above and press return to search.

గాల్లో ఎగురుతూ మందు కొడుతున్న ర‌త్తాలు!

By:  Tupaki Desk   |   24 Oct 2021 12:30 AM GMT
గాల్లో ఎగురుతూ మందు కొడుతున్న ర‌త్తాలు!
X
ల‌క్ష్మీరాయ్ అలియాస్ రాయ్ ల‌క్ష్మిగా మారిన‌ప్ప‌టికీ అమ్మ‌డి కెరీర్ మాత్రం అనుకున్నంత స్పీడ్ అందుకోలేదు. అవ‌కాశాలైతే వ‌స్తున్నాయి గానీ అగ్ర హీరోల‌తో న‌టించేఛాన్స్ మాత్రం ద‌క్క‌డం లేదు. ప్ర‌స్తుతం అమ్మ‌డి చేతిలో అర‌డ‌జ‌ను చిత్రాలున్నాయి. తెలుగు..త‌మిళ్..క‌న్న‌డ భాష‌ల‌న్నింటి క‌లిపితే అన్ని చిత్రాలుగా లెక్క తేలింది. వీటిలో ఏదైనా పెద్ద చిత్రం ఒక్క‌టైనా? ఉంది అంటే అన్ని మీడియం బ‌డ్జెట్ చిత్రాలుగానే క‌నిపిస్తున్నాయి. తెలుగులో `ఆనంద భైర‌వి` అనే ఓచిత్రంలో న‌టిస్తోంది. కొత్త ద‌ర్శ‌కుడు క‌ర్రీ బాలాజీ దీనికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నాడు. అంజ‌లి..రాయ్ ల‌క్ష్మి అదితి అరున్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతోంది.

అయితే సినిమాకి ప‌నిచేస్తోన్న టెక్నీష‌న్లు మాత్రం అంతా సీనియ‌ర్లే.. సంగీతం మ‌ణిశ‌ర్మ అందిస్తుండ‌గా..పీజీ విందా సినిమాటోగ్రాఫ‌ర్ గా.. చోటా. కె. ప్ర‌సాద్ ఎడిటింగ్ చేస్తున్నారు. ఇలా టాప్ క్లాస్ టెక్నీషియ‌న్లు ఈ సినిమాకి ప‌నిచేయ‌డం విశేషం. ఇలా అమ్మ‌డి ప్రోఫెష‌న‌ల్ కెరీర్ సాగుతుంది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే రామ్ ల‌క్ష్మీ ఓ ల‌గ్జ‌రీ విమానంలో మందు కొడుతూ ప్ర‌యాణించ‌డం ఇప్పుడు హాట్ టాపిక్. దానికి సంబంధించిన ఓ ఫోటోని రాయ్ ల‌క్ష్మి అభిమానుల‌కు షేర్ చేయ‌డం విశేషం.

ఇందులో రాయ్ ల‌క్ష్మి ప‌సుపు వ‌ర్ణం స్పోర్స్ట్ ప్యాంట్..టీష‌ర్టు ధ‌రించింది. చేతిలో వైన్ గ్లాస్ ప‌ట్టుకుని చిల్ అవుతోంది. ఓ ప్ర‌యివేటు ప్లైట్ లో ఇలా ఫోజులిచ్చిన‌ట్లు క‌నిపిస్తోంది. ఇక అమ్మ‌డి గ్లామ‌ర్ ఎలివేష‌న్స్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్ స్టాని త‌న అందాల‌తో హీటెక్కించ‌డం స‌హ‌జ‌మే. బికినీ..టూపీస్ ల్లో చాలాసార్లు ఆందాలు ఆరబోసింది. ఫ్యాష‌న్ ఐకానిక్ గాళ్ల్ గా త‌న‌ని ప్ర‌మోట్ చేసుకోవ‌డానికి ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంది. డిఫ‌రెంట్ ఫోటో షెష‌న్స్ లో పాల్గొన‌డానికి ఈ బ్యూటీ ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తుంటుంది. మ‌రి ఈపిక్ అలాంటిదనే భావిద్దాం.