Begin typing your search above and press return to search.

బాలీవుడ్‌ అనగానే బికినీ వేస్తోంది

By:  Tupaki Desk   |   16 Sep 2015 5:47 AM GMT
బాలీవుడ్‌ అనగానే బికినీ వేస్తోంది
X
మ‌హేంద్ర‌సింగ్ ధోనీతో ఎఫైర్ మొద‌లు ల‌క్ష్మీ రాయ్ పేరు అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో్ పాపుల‌ర్ అయిపోయింది. నాటి నుంచి ఈ అమ్మ‌డు కెరీర్ ప‌రంగా తిరిగి చూసుకున్న‌దే లేదు. అడ‌పాద‌డ‌పా త‌న‌వైపు వ‌చ్చిన అన్ని అవ‌కాశాల్ని అందిపుచ్చుకుంది. పొదుపైన దుస్తుల్లో క‌నిపించ‌డానికి, బికినీలో సొగ‌సుల్ని ఆర‌బోయ‌డానికి ఈ అమ్మ‌డు ఎలాంటి అడ్డూ చెప్ప‌దు. అందుకే మ‌న ఫ‌లింమేక‌ర్స్ వీలున్న‌ప్పుడ‌ల్లా ఛాన్సిచ్చి ఎంక‌రేజ్ చేస్తూనే ఉన్నారు.

ప్ర‌స్తుతం ఈ భామ దీప‌క్ శివ‌దాసాని ద‌ర్శ‌క‌త్వంలోని ''జూలీ 2'' థ్రిల్ల‌ర్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అందునా ఈ సినిమా బాలీవుడ్‌ లో తెర‌కెక్కుతోంది. రాయ్ ల‌క్ష్మీకి ఇదే తొలి ప పూర్తి బాలీవుడ్ సినిమా. అందుకే ఈ అమ్మ‌డు చాలా ఎగ్జ‌యిట్ అవుతోంది. రాయ్ ల‌క్ష్మీ త‌న క్యారెక్ట‌ర్ గురించి చెబుతూ .. ఈ సినిమా ఓ చ‌క్క‌ని థ్రిల్ల‌ర్‌. ఓ ప‌క్కింటి అమ్మాయి గా క‌నిపిస్తా. ఓ సాదాసీదా అమ్మాయి లీడింగ్ హీరోయిన్‌ గా ఎలా ఎదిగింద‌న్న‌దే క‌థాంశం. ప్ర‌తి బిట్ లో గ్లామ‌ర్ క‌నిపిస్తుంది. ఇందులో ఎమోష‌న్‌ - డ్రామా - కామెడీ - గ్లామ‌ర్ ఇన్ని కోణాలు చూపించ‌బోతున్నా. మొద‌టిసారి పూర్తి స్థాయిలో బాలీవుడ్ సినిమాలో క‌నిపించ‌బోతున్నందుకు చాలా ఎగ్జ‌యిటింగ్ ఉంద‌ని రాయ్ ల‌క్ష్మీ చెప్పింది. అంతే కాదు.. బికినీలో మెరవబోతోందట. అందుకోసం కసరత్తులు కూడా స్టార్ట్‌ చేసిందట.

ప్ర‌స్తుతం సావ‌కార్‌ పెట్టాయ్‌, బెంగ‌ళూర్ డేస్ రీమేక్‌ లోనూ న‌టిస్తున్నా. ఈ సినిమాలు పూర్తి చేసి బాలీవుడ్ సినిమా కోసం అక్టోబ‌ర్ నుంచి రెడీ అవుతున్నా. ప్ర‌స్తుతం జిమ్‌ లో క‌సర‌త్తులు చేస్తూ .. దేహాన్ని బికినీకి అనుగుణంగా మార్చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చింది. ఏ.ఆర్‌.మురుగ‌దాస్ అకీరా చిత్రంలో అతిధిపాత్ర‌లో న‌టిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంద‌ని రాయ్ ల‌క్ష్మీ చెప్పింది. ర‌వితేజ బ‌లుపులో ల‌క్కీరాయ్‌ గా క‌నిపించి ఆక‌ట్టుకుంది. మునుముందు బికినీలోనూ తెలుగు ప్రేక్ష‌కులపై మ‌త్తు చ‌ల్లుతుందేమో చూడాలి.