Begin typing your search above and press return to search.

మతి పోగొట్టే సినిమాలో రాయ్ లక్ష్మీ

By:  Tupaki Desk   |   14 Sep 2015 1:30 PM GMT
మతి పోగొట్టే సినిమాలో రాయ్ లక్ష్మీ
X
దాదాపు దశాబ్ద కాలం నుంచి ఇండస్ట్రీలో ఉంది లక్ష్మీరాయ్. కానీ ఎప్పుడూ చెప్పుకోదగ్గ అవకాశాలు రాలేదామెకు. అప్పుడప్పుడూ ‘అధినాయకుడు’ లాంటి పెద్ద సినిమాల్లో కనిపించినా అవి సరైన ఫలితాన్నివ్వలేదు. కోలీవుడ్ లో చిన్నా చితకా పాత్రలు చేస్తూ నెట్టుకొచ్చేస్తోందామె. రెండేళ్ల కిందట తన పేరును రాయ్ లక్ష్మీగా మార్చుకున్నా ఆమెకు కాలం కలిసి రాలేదు. ఐతే ఇప్పుడిప్పుడే ఆమె కెరీర్ కొంచెం ఊపందుకుంటున్నట్లుంది. తమిళంలో ‘షౌకార్ పేట’ అనే హార్రర్ సినిమాలో నటించిన రాయ్ లక్ష్మీకి తెలుగులో పవన్ కళ్యాన్ పక్కన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ లభించింది. వీటన్నటికంటే కూడా పెద్ద ఆఫర్ ఒకటి తగిలింది రాయ్ లక్ష్మీకి.

బాలీవుడ్ లో ఆమె ప్రధాన పాత్రలో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీ తెరకెక్కబోతోంది. చాలా ఏళ్ల కిందట నేహా ధూపియా ప్రధాన పాత్రలో నటించిన మసాలా మూవీ ‘జూలీ’కిది సీక్వెల్. బాలీవుడ్ లో అంతమంది హాట్ భామలుండగా రాయ్ లక్ష్మీనే ఈ అవకాశం వరించడం విశేషమే. జూలీ సినిమా అప్పట్లో సంచలనమైంది. నేహా హాట్ హాట్ గా కనిపించి కుర్రాళ్ల మతులు పోగొట్టింది. జూలీ-2లో నటించడానికి నేహా కూడా రెడీగా ఉంది. అవకాశమివ్వాలే గానీ.. అందాలు ఆరబోయడానికి చాలామంది లైన్ లో ఉన్నారు. అయినా రాయ్ లక్ష్మీనే ఎంచుకున్నారంటే.. ఆమె దేనికైనా రెడీ అనే ఉంటుంది. కెరీర్ ఆరంభం నుంచి ఎక్స్ పోజింగ్ కు రెడీ అన్న సంకేతాలే ఇచ్చినా.. ఆమెను సరిగా ఎవరూ ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఏకంగా బాలీవుడ్ అవకాశం వచ్చింది కాబట్టి ‘జూలీ-2’లో రాయ్ రెచ్చిపోవడం ఖాయం.