Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : బొత్తాలు విప్పి చూపిస్తున్న రత్తాలు...!

By:  Tupaki Desk   |   19 May 2020 12:10 PM GMT
పిక్ టాక్ : బొత్తాలు విప్పి చూపిస్తున్న రత్తాలు...!
X
ల‌క్ష్మీ రాయ్.. సౌత్ సినీ అభిమానులకు ఈమె గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఆమె కెరీర్ లో హీరోయిన్ గా అనుకున్నంతగా అవకాశాలు అందుకోకపోయినప్పటికి ఆమె గ్లామర్ వల్ల బాగా క్రేజ్ తెచ్చుకుంది. 'కాంచనమాల కేబుల్ టీవీ' సినిమాతో తెలుగులో పరిచయమైన 'లక్ష్మీరాయ్' ఇప్పుడు 'రాయ్ లక్ష్మీ'గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి వెళ్లిన ఈ భామ అక్కడ తన అందచందాలతో అవకాశాలను బాగానే సొంతం చేసుకుంది. ఆమె నటించిన పలు సినిమాలో తెలుగులోకి అనువాదమై మంచి ఫలితాలు కూడా పొందాయి. తెలుగులో మాత్రం ఐటమ్ సాంగ్స్ చేస్తూ ఇక్కడి ప్రేక్షకులను అలరించింది.

'గబ్బర్ సింగ్' సినిమాలో తోబ తోబా' సాంగ్ లో పవన్ కళ్యాణ్ సరసన కాలు కదిపింది. అంతేకాకుండా మెగాస్టార్ రీఎంట్రీ సినిమా 'ఖైదీ 150'లో 'రత్తాలు రత్తాలు' పాటకి స్టెప్పేసింది. దీంతో టాలీవుడ్ రత్తలుగా మారిపోయింది రాయ్ లక్ష్మీ. అమ్మడు బాలీవుడ్‌ లో కూడా అడుగుపెట్టింది. 'జూలీ 2' సినిమాతో తన అందాలను ప్రదర్శించింది. అయితే అక్కడా అమ్మడికి లక్ కలిసి రాలేదు. ఆ తర్వాత మలయాళంలోకి అడుగుపెట్టి మమ్ముట్టి పక్కన నటించే ఛాన్స్ సొంతం చేసుకుంది. మొత్తం మీద అన్ని ఇండస్ట్రీలలో అడుగుపెట్టిన రత్తాలు ఎక్కడా స్టార్ హీరోయిన్ గా మారలేకపోయింది. ఒకప్పుడు బొద్దుగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు కాస్త సన్నబడింది.

ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ఎప్పుడూ యాక్టీవ్ గా ఉండే రాయ్ లక్ష్మి ఎలాంటి ఫోటో షేర్ చేసినా నిమిషాల్లో వైరల్ అవుతుంది. తాజాగా సోషల్ మీడియా వేదికగా మరోసారి తన అందాలను ఆరబోసి నెటిజన్స్ మతులుపోగొట్టేస్తోంది. ఎల్లో కలర్ జాకెట్ బటన్స్ విప్పేసి వయ్యారంగా తలపై చేయి పెట్టుకొని ఒక ఫోజ్ ఇచ్చింది. ఇంకేముంది మన కుర్రకారు 'బొత్తాలు విప్పిన రత్తాలు' అని.. సమ్మర్ హీట్ తన వేడి పుట్టించే అందాలతో డబల్ చేస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటో అమ్మడి అందాలు చూసిన రసిక హృదయాలు తట్టుకోలేపోతున్నారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇదిలా ఉండగా రాయ్ లక్ష్మీ గతేడాది 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' సినిమాతో టాలీవుడ్ ని పలకరించింది. ప్రస్తుతం తమిళ్ లో రెండు సినిమాలు లైన్లో పెట్టిన ఈ భామ తెలుగులో 'ఆనంద భైరవి' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతోనైనా టాలీవుడ్ లో మంచి అవకాశాలు దక్కించుకోవాలని రాయ్ లక్ష్మీ అభిమానులు కోరుకుంటున్నారు.