Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో మరో నయా దర్శకుడు

By:  Tupaki Desk   |   19 July 2015 12:45 PM IST
టాలీవుడ్ లో మరో నయా దర్శకుడు
X
తెలుగు చిత్రసీమ కొత్త దర్శకులతో కొత్తపుంతలు తొక్కుతోంది. సుధీర్ వర్మ, చందు మొండేటి లాంటి నవ యువ దర్శకులతో సహా కృష్ణ చైతన్య, కొరటాల శివ లాంటి రచయితలు, సహాయ దర్శకులూ మెగా ఫోన్ పట్టి విజయాన్ని వసపరచుకుంటున్నారు. తాజాగా మరో సహాయ దర్శకుడు దర్శకుడి గా ఎంట్రీ ఇవ్వనున్నాడు. విజయభాస్కర్, త్రివిక్రమ్, సురేందర్ రెడ్డి వంటి వారి వద్ద దర్శకత్వ శాఖ లో చేసిన ఆర్ సామల సుమంత్ అశ్విన్ హీరో గా రూపొందుతున్న సినిమా తో దర్శకుడి గా ప్రమోట్ అయ్యారు.

ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తి కావచ్చింది. తుది షెడ్యూల్ మాత్రమే మిగిలుంది. కొలంబస్ - డిస్కవరీ ఆఫ్ లవ్ పేరు తో తెరకెక్కుతున్న ఈ సినిమా లో సీరత్ కపూర్, మిస్తీ చక్రవర్తి హీరోయిన్లు గా నటిస్తున్నారు. అంతకుముందు ఆ తరవాత, కేరింత సినిమాల తో రొటీన్ కథలకు దూరంగా ఉంటున్న అశ్విన్ ఈ సినిమా తో మరో విజయం తన ఖాతా లో వేసుకోవాలని ఉబలాటపడుతున్నాడు. నిర్మాణాంతర కార్యక్రమాలు ఆగష్టు కల్లా పూర్తి చేసి అదే నెల లో ఆడియోని, సెప్టెంబర్ లో సినిమాని విడుదల చేయనున్నారు. దర్శకుడి గా ఆర్ సామలకు మొదటి విజయం దక్కాలని ఆశిద్దాం.