Begin typing your search above and press return to search.

మెగా మూవీపై ఎర్రన్న కామెంట్స్‌

By:  Tupaki Desk   |   23 Dec 2020 8:40 AM IST
మెగా మూవీపై ఎర్రన్న కామెంట్స్‌
X
విప్లవ సినిమాల కథానాయకుడిగా.. దర్శకుడిగా.. నిర్మాత తనకంటూ ఒక ప్రత్యేకమైన పేరును తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ ను సొంతం చేసుకున్న ఆర్‌ నారాయణ మూర్తి కమర్షియల్ సినిమాల్లో ఆఫర్లు వచ్చినా కూడా కాదన్న సందర్బాలు చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా ఉంటూ ఎన్నో సినిమాల్లో నటించి నిర్మించి.. దర్శకత్వం వహించి స్టార్‌ ఇమేజ్ ఉన్నా కూడా ఇంకా సింపుల్ గా రోడ్డు మీద అలా నడుచుకుంటూ వెళ్లే వ్యక్తి నారాయణమూర్తి. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయాడు. ఇటీవల నారాయణ మూర్తి మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్ నటించిన 'సోలో బ్రతుకే సోబెటర్‌' సినిమా పై స్పందించాడు.

సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాలో హీరో కు మాజీ ప్రధాని వాజ్‌ పేయి.. మాజీ రాష్ట్రపతి అబ్దుల్‌ కలాం మరియు ఎర్రన్న ఆర్‌ నారాయణ మూర్తి గార్లు ఆదర్శం. వారి బాటలో నడవాలనే ఉద్దేశ్యంతో పెళ్లి చేసుకోకుండా సోలో బ్రతుకును లీడ్‌ చేయాలని భావిస్తాడు. ఆ క్రమంలో సినిమాలో పలు సందర్బాల్లో ఆర్‌ నారాయణ మూర్తి పేరును పాత్రను వాడటం జరిగింది. ఆ విషయమై ఎర్రన్న స్పందిస్తూ.. అంత గొప్ప ప్రముఖుల పక్కన నన్ను ఉంచడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. దర్శకుడు సుబ్బు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా అభిమానిగా కనిపించేందుకు ఒప్పుకున్న సాయి ధరమ్‌ తేజ్‌ గారికి కూడా కృతజ్ఞతలు.

నా గురించి సినిమాలో పెట్టడం నాకు గర్వకారణం అన్నారు. గతంలో పూరి జగన్నాధ్ గారు దేశ ముదురు సినిమా తీసిన సమయంలో హీరో పేరు వచ్చిన సమయంలో చిరంజీవి గారిని.. నిర్మాత పేరు వచ్చిన సమయంలో పవన్‌ కళ్యాణ్‌ గారిని.. దర్శకుడి పేరు వచ్చిన సమయంలో నా ఫొటోను వేశారు అది నాకు ఎంతో గర్వకారణం అనిపించింది. కెమెరా మెన్‌ గంగతో రాంబాబు సినిమా ను నాకు అంకితం ఇవ్వడం జరిగింది. టెంపర్‌ సినిమాలో సిన్సియర్ కానిస్టేబుల్‌ పాత్రకు నా పేరు పెట్టారు. అందుకు కూడా నేను ఎంతో గర్విస్తున్నాను అన్నాడు. ఇక సోలో బ్రతుకే సోబెటర్‌ లో నన్ను చూపించబోతున్నందుకు మరోసారి కృతజ్ఞతలంటూ ఎర్రన్న టీం సభ్యులందరికి శుభాకాంక్షలు తెలియజేశాడు.