Begin typing your search above and press return to search.

సాహో.. వచ్చే ఏడాది కలుద్దాం

By:  Tupaki Desk   |   25 Jan 2018 12:01 PM GMT
సాహో.. వచ్చే ఏడాది కలుద్దాం
X
పోయినేడాది ఆరంభంలో ‘సాహో’ ప్రారంభోత్సవం జరిగింది. ఆ ఏడాది ఆఖర్లోనే.. లేదా ఈ ఏడాది మొదట్లోనో సినిమా రిలీజైపోతుందని ఆశించారు ప్రభాస్ అభిమానులు. కానీ సినిమా ప్రారంభోత్సవం అయితే జరిగింది కానీ.. సెట్స్ మీదికి వెళ్లడానికి చాలా సమయం పట్టేసింది. రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యాక కూడా అంత వేగం ఏమీ కనిపించట్లేదు. కొంచెం ఆలస్యం అయినప్పటికీ ఈ ఏడాది ఏదో ఒక టైంలో సినిమా రిలీజవుతుందిలే అని ఆశించారు. కానీ అలాంటి ఆశలేమీ పెట్టుకోవద్దంటూ ‘సాహో’ సినిమాటోగ్రాఫర్ మాది స్పష్టం చేశాడు. ‘సాహో’ ఈ ఏడాది విడుదల కాదంటూ ఆయన బాంబు పేల్చారు.

ఓ ఇంటర్వ్యూలో భాగంగా మధి మాట్లాడుతూ.. ‘సాహో’ షూటింగ్ ఇప్పటిదాకా 50 శాతం పూర్తయిందన్నాడు. మిగతా సగం పూర్తి కావడానికి ఇంకా చాలా సమయమే పడుతుందని.. బహుశా ఈ ఏడాది చివరికి సినిమా పూర్తి కావచ్చిన మధి తెలిపాడు. వచ్చే ఏడాది ఆరంభంలో ‘సాహో’ రిలీజ్ కావచ్చని కూడా అన్నాడు. ‘సాహో’ భారీ సినిమా అని.. ప్రతి సన్నివేశం ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నామని.. కాబట్టే ఆలస్యమవుతోందని మాది తెలిపాడు. దీన్ని బట్టే ‘బాహుబలి: ది కంక్లూజన్’ వచ్చిన రెండేళ్లకు కానీ మళ్లీ బిగ్ స్క్రీన్ మీద ప్రభాస్ కనిపించడన్నమాట. ‘సాహో’ అయ్యాక పెళ్లి చేసుకుంటానని ప్రభాస్ చెప్పినట్లుగా అతడి పెదనాన్న కృష్ణం రాజు ఇటీవలే చెప్పిన సంగతి తెలిసిందే. అంటే.. అతడి పెళ్లి ఈ ఏడాది కూడా ఉండదన్నమాట.