Begin typing your search above and press return to search.

ఆహా.. మరో విభిన్నమైన సినిమా

By:  Tupaki Desk   |   9 March 2022 8:37 AM GMT
ఆహా.. మరో విభిన్నమైన సినిమా
X
ఆహా ఓటీటీ లో వరుసగా మంచి మంచి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెలిసిందే. చిన్న సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద సినిమాలను కూడా ఆహా ఓటీటీ వారు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ ఎంటర్టైన్మెంట్ ను పీక్స్ లో అందిస్తున్నారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన సినిమాలను కొనుగోలు చేయడం మాత్రమే కాకుండా.. వాటిని ప్రేక్షకుల ముందుకు అంతే క్రేజ్ తో తీసుకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

సినిమా సినిమాకు ఆహా ఓటీటీ యొక్క ఆదరణ పెరుగుతూనే ఉంది అంటూ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ సమయంలో మరో సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఆహా ఓటీటీ సిద్ధమైంది. భారీ అంచనాల నడుమ రూపొందిన సినిమాలు మాత్రమే కాకుండా చిన్న సినిమాలను కూడా ఆహా ఓటీటీ లో ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అందుకే తాజాగా పాత బస్తీ నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఖుబూల్‌ హై ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అయ్యారు.

ఈ సినిమా ట్రైలర్ ను స్టార్ హీరో రానా చేతుల మీదుగా విడుదల చేయించారు. పెద్ద ఎత్తున పాజిటివ్‌ కామెంట్స్ ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కు దక్కాయి. పాత బస్తీలో అది కూడా ముస్లిం ఏరియా లో చిన్న ఆడ పిల్లలు ఎలా ఉన్నారు.. పేద కుటుంబాలకు చెందిన అమ్మాయిలను దుబాయి షేక్ లకు ఇచ్చి ఎలా పెళ్లి చేస్తారు.. ఆ తర్వాత వారు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటారు అనేది ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది అర్థం అవుతుంది.

ఇది ఒక పక్క మాస్ డిఫరెంట్‌ మూవీ గా ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ట్రైలర్ చూస్తుంటే ఆహా ఓటీటీ లో మరొక మంచి సినిమాగా ఈ సినిమా నిలుస్తుంది అనిపిస్తుంది అంటూ ట్రైలర్‌ చూసిన జనాలు కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో ఈనెల 11న స్ట్రీమింగ్‌ అవ్వబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆహా ఓటీటీ ఈ సినిమాతో కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకుంటారనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.

అల్లు అరవింద్ మరియు ఆహా టీం సినిమా ను కొనుగోలు చేసే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. ప్రతి ఒక్క విషయాన్ని పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత మాత్రమే కొనుగోలు చేయడం జరుగుతుంది. కనుక ఈ సినిమా కూడా తప్పకుండా ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉంటుందని.. వారు ఈ సినిమాపై చాలా నమ్మకంతో తీసుకొని ఉంటారు అంటూ విశ్లేషకులు మరియు సోషల్ మీడియా వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ట్రైలర్ చూస్తుంటే మాత్రం కచ్చితంగా ఒక మంచి మెసేజ్ ని ఇవ్వబోతున్నట్లు అనిపిస్తుందని కామెంట్స్ వస్తున్నాయి.