Begin typing your search above and press return to search.

పాకిస్తానీ ట్విట్టర్ గాళ్‌ ని చంపేశారు!!

By:  Tupaki Desk   |   16 July 2016 9:15 AM GMT
పాకిస్తానీ ట్విట్టర్ గాళ్‌ ని చంపేశారు!!
X
అసలు పాకిస్తాన్ వంటి దేశాల్లో అభివృద్ది అనేది లేకపోగా.. మతం పేరుతో పాశవికత ఎలా పేరుకుపోయిందో మరోసారి ప్రూవ్ అయ్యింది. మన దేశంలో ఎలాగైతే ట్విట్టర్ లో విశృంఖలంగా అందాలను ఆరబోస్తూ పూనమ్ పాండే పాపులర్ అయ్యిందో.. పాకిస్తాన్‌ లో కూడా కందీల్ బలోచ్ అనే అమ్మాయి అలాగే ఫ్యామస్ అయ్యింది.

ఫాజియా అజీమ్‌ ఈమె అసలు పేరు. ఈ మధ్యనే కొందరు ఈమె ఒరిజినల్ ఐడెండీటీని లీక్ చేశారు. అప్పట్లో షాహీద్‌ అఫ్రిదీ ఇండియా సిరీస్ లో కాని.. ఇండియాతో మ్యాచ్ గాని గెలిస్తే తాను న్యూడ్ గా ఫేస్ బుక్ లో వీడియో పెడతానంటూ ఈమె పాపులార్టీ సంపాదించింది. అయితే అందంతో పాపులర్టీ సంపాదించడంకంటే.. పాకిస్తాన్ లో మహిళల హక్కులను ఎలా కాలరాస్తున్నారు అనే అంశాలపై సోషల్ మీడియాలో ఉతికి ఆరేసింది. ఒక పెద్ద మసీదుకు చెందిన ముఫ్తీ ఇమామ్ ఒకరు స్ర్తీ లోలుడు అంటూ ఈ మధ్యనే అతనితో కాస్త ఇంటిమేట్ గా ఉండే సెల్ఫీలు దిగి.. వాటిని ఇంటర్నెట్ లో పెట్టేసి.. పాకిస్తాన్ లో సంచలనం సృష్టించింది. ఈ మధ్యనే జరిగిన ఈ ఇన్సిడెంట్‌ తరువాత.. ఆమె ఇస్లాం మతాన్ని అవమానిస్తోందని.. భారత్ లో బిగ్ బాస్ షోలో పాల్గొనడానికి వెళుతూ.. ఇలా కావాలనే పాకిస్తాన్ ను హేళన చేస్తోందని.. అక్కడి యువత మండిపడ్డారు.

ఈ క్రమంలో మొన్ననే రంజాన్ పండుగకు ఇంటికెళ్లిన ఆమెను.. గత రాత్రి ఆమె సొంత తమ్ముడే గొంతు నుమిలి చంపేశాడని పోలీసులు చెబుతున్నారు. కుటుంబ పరువును కాపాడటానికి ఇలా చేశాడట.