Begin typing your search above and press return to search.

మహేష్ టైటిల్.. లీక్ అయిపోయిందా?

By:  Tupaki Desk   |   20 Feb 2017 8:58 AM GMT
మహేష్ టైటిల్.. లీక్ అయిపోయిందా?
X
మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ ఏంటి? చాలా నెలల నుంచి ఇదో పెద్ద పజిల్ గా మారిపోయింది. చట్టంతో పోరాటం నుంచి స్టార్ట్ చేసి చాలానే టైటిల్స్ వినిపించాయి. ఎనిమీ.. వాస్కోడగామా.. అభిమన్యు.. ఇలా బోలెడన్ని టైటిల్స్ వినిపించాయి. సంభవామి అనే పేరు కూడా పరిశీలిస్తున్నారనే టాక్ ఉంది.

ఇన్ని పేర్ల మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయిన సూపర్ స్టార్ ఫ్యాన్స్.. ఫస్ట్ లుక్ తో దీనికి చెక్ పెడతాడులే అని ఫిక్స్ అయిపోయారు. ఆ ముహూర్తం కూడా ఎప్పుడో తెలియక గందరగోళంలో ఉన్న మహేష్ అభిమానులకు.. నిర్మాత పీవీపీ చేసిన ఓ కామెంట్.. అసలు విషయం అర్ధమయేలా చేసింది. సాయిధరం తేజ్ మూవీ విన్నర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన పీవీపీ.. 'ఈ ఏడాది ఠాగూర్ మధు మూడు సినిమాలు తెస్తున్నారు. విన్నర్.. మిస్టర్.. సంభవామి యుగేయుగే. అన్నీ సక్సెస్ కావాలని కోరుకుంటున్నా' అని చెప్పాడు పీవీపీ.

మహేష్ మూవీలో ఠాగూర్ మధు ఓ భాగం అనే సంగతి తెలిసిందే. దానికి సంభవామి అనే ప్రచారానికి.. పీవీపీ-మహేష్ ల మధ్య రిలేషన్ ను బేస్ చేసుకుని.. ఇలా 'సంభవామి యుగేయుగే' అనే టైటిల్ ని లీక్ చేశారని అంటున్నారు. ఆ సంగతి అలా ఉంటే.. తమ హీరో కొత్త సినిమా టైటిల్ తెలిసిపోవడంతో.. మహేష్ ఫ్యాన్స్ ఇప్పుడు తెగ హుషారుగా ఉన్నారు. కొత్త టైటిల్ ని ట్రెండింగ్ చేసేస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/