Begin typing your search above and press return to search.

పీవీ సింధు కి ఆ స్టార్ హీరో స్నేహితుడు

By:  Tupaki Desk   |   21 Aug 2022 5:26 PM IST
పీవీ సింధు కి ఆ స్టార్ హీరో స్నేహితుడు
X
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు తాజాగా ఆలీతో సరదాగా టాక్ షో లో పాల్గొంది. ఎప్పుడు కూడా సినిమా ఇండస్ట్రీకి చెందిన సెలబ్రెటీతో ఆలీతో సరదాగా కార్యక్రమం ను నిర్వహిస్తూ ఉంటారు. కాని మొదటి సారి సినిమాయేతర సెలబ్రెటీలతో ఆలీతో సరదాగా టాక్ షో సాగింది. ఆ ఎపిసోడ్‌ కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదల అయ్యింది.

ఈ వారం టెలికాస్ట్‌ అవ్వబోతున్న ఆ ఎపిసోడ్‌ లో పీవీ సింధు పలు విషయాల గురించి మాట్లాడుతున్నట్లుగా ప్రోమో చూస్తే అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఏ హీరో అంటే మీకు చాలా ఇష్టం అంటూ అలీ ప్రశ్నించిన సమయంలో ప్రభాస్‌ అంటూ ఠక్కున సింధు చెప్పింది. ఎందుకు మీరు ఇద్దరు ఒకే హైట్ అవ్వడం వల్ల ఆయన్ను ఇష్టపడుతున్నావా అంటూ అలీ సరదాగా అన్నాడు.

అలా ఏం కాదు కాని ప్రభాస్ గారితో నాకు పరిచయం ఉంది. ఆయనతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూ చెప్పుకొచ్చింది. పీవీ సింధు సినిమాల గురించి మాట్లాడుతూ భవిష్యత్తులో తాను సినిమా లో నటిస్తానేమో.. అది తన బయోపిక్ అవుతుందేమో చెప్పలేను అన్నట్లుగా సస్పెన్స్ లో ఉంచింది.

నటిగా ప్రస్తుతానికి ఎలాంటి ఆసక్తి లేదని మాత్రం క్లారిటీ ఇచ్చింది. పెళ్లి విషయంలో కూడా ప్రస్తుతం ఆలోచన లేనట్లే అన్నట్లుగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం పూర్తిగా ఆట మీదే దృష్టి పెట్టినట్లుగా పేర్కొంది. పీవీ సింధు పూర్తి ఎపిసోడ్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఫుల్‌ ఎపిసోడ్‌ లో మరిన్ని విషయాలను ఆమె అలీతో పంచుకునే అవకాశం ఉంది.