Begin typing your search above and press return to search.

మాస్క్‌ పెట్టుకోండి అంటూ మరీ పచ్చిగా చెప్పిన ముద్దుగుమ్మ

By:  Tupaki Desk   |   18 Nov 2020 3:40 PM IST
మాస్క్‌ పెట్టుకోండి అంటూ మరీ పచ్చిగా చెప్పిన ముద్దుగుమ్మ
X
తమిళ స్టార్‌ నటుడు శరత్‌ కుమార్ కూతురు వరలక్ష్మి చాలా బోల్డ్‌ గా ఉంటుందనే విషయం తెల్సిందే. ఆమె హీరోయిన్‌ గా నటిస్తూనే నటనకు ఆస్కారం ఉండే విలన్‌ పాత్రలను ఇంకా కీలక పాత్రలను చేస్తూ ఉండటంతో ఆమెకు మల్టీ ట్యాలెంటెడ్‌ హీరోయిన్‌ అంటూ పేరు పడింది. ఇక సోషల్‌ మీడియాలో ఆమె రెగ్యులర్‌ గా చేసే కామెంట్స్‌ మరియు పోస్ట్‌ లు వైరల్‌ అవుతూ ఉంటాయి. తాజాగా ఆమె చేసిన పోస్ట్‌ మరోసారి వైరల్‌ అయ్యింది.

ప్రతి ఒక్కరు ఈసమయంలో మాస్క్‌లు ధరించాలంటూ పదే పదే చెబుతున్నా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. మాస్క్‌ ల యొక్క ప్రాముఖ్యతను ఒకొక్కరు ఒక్కో రకంగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు. వరలక్ష్మి చాలా విభిన్నంగా మాస్క్‌లకు సంబంధించిన ప్రాముఖ్యతను వివరించింది. ఒక ఫొటోను షేర్‌ చేసిన ఆమె మాస్క్‌ యొక్క ప్రాముఖ్యతను కాస్త పచ్చిగా బోల్డ్‌ గా చెప్పింది. పాయింట్‌ ధరించి మూత్రం పోస్తే పాయింట్‌ లో పడుతుంది. ఎదురుగా వ్యక్తి ఉన్నప్పుడు పాయింట్‌ విప్పి మూత్రం పోస్తే ఆ పాయింట్‌ తడుస్తుంది. అదే ఇద్దరు పాయింట్లు లేకుండా ఉంటే ఇద్దరు కూడా తడుస్తారు. అదే ఇద్దరు పాయింట్లు ధరిస్తే ఒక్కరికే ప్రమాదం. అందుకే ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించాలని బోల్డ్‌ గా వరలక్ష్మి పోస్ట్‌ చేసింది.