Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ చేయి కూడా వారసుడికి అందింది

By:  Tupaki Desk   |   11 Jan 2022 4:28 AM GMT
పుష్ప రాజ్ చేయి కూడా వారసుడికి అందింది
X
టాలీవుడ్ కు మరో వారసుడు పరిచయం అవ్వబోతున్నాడు. దిల్‌ రాజు ఫ్యామిలీ నుండి హీరోగా ఆశిష్ రెడ్డి రౌడీ బాయ్స్ చిత్రంతో ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దం అయ్యాడు. దిల్ రాజు ఈ సినిమాను మంచి సమయం కోసం వెయిట్‌ చేసి సంక్రాంతికి విడుదల చేస్తున్నాడు. సంక్రాంతి సినిమాలు విడుదల వాయిదా పడ్డ వెంటనే ఈ సినిమాను దిల్ రాజు ప్రకటించాడు. దిల్‌ రాజు ఈ సినిమాను తనదైన శైలిలో ప్రమోట్‌ చేస్తున్నాడు. సినిమా చిత్రీకరణ మొదలుకుని అంచనాలు పెంచేస్తూనే ఉన్నారు. దిల్‌ రాజు తనకు ఉన్న పరిచయాలతో ఈ సినిమాకు మంచి పబ్లిసిటీ చేయడం జరిగింది.

ఇప్పటికే పలువురు స్టార్స్‌ రౌడీ బాయ్స్ గురించి మాట్లాడారు. ఇటీవలే యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ రౌడీ బాయ్స్ సినిమా ట్రైలర్‌ ను ఆవిష్కరించాడు. ఆయన చిత్ర యూనిట్‌ సభ్యులకు ఆల్ ది బెస్ట్‌ చెప్పడంతో పాటు ట్రైలర్‌ బాగుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఎన్టీఆర్‌ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల అవ్వడంతో ఇప్పటికే ఇండస్ట్రీలో మరియు ప్రేక్షకుల్లో రౌడీ బాయ్స్ సినిమా గురించి తెగ చర్చ జరుగుతోంది. ఈ సమయంలో పుష్ప రాజ్ కూడా రౌడీ బాయ్స్ కోసం తనవంతు సాయం ను అందించాడు. తాజాగా రౌడీ బాయ్స్ చిత్రంలోని డేట్‌ నైట్‌ సాంగ్ ను అల్లు అర్జున్‌ విడుదల చేయడం జరిగింది.

పుష్ప తో ఈ మద్య తెగ సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్న అల్లు అర్జున్‌ కూడా రౌడీ బాయ్స్ కు హెల్ప్‌ అవ్వడం ఖచ్చితంగా సినిమా స్థాయి మరింతగా పెంచింది అనడంలో సందేహం లేదు. రౌడీ బాయ్స్ సినిమా లో ఆశిష్ రెడ్డి కు జోడీగా అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్ గా నటించింది.

కాలేజీ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కిన ఒక విభిన్నమైన యూత్‌ ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌ గా ఈ సినిమా ఉంటుందని ట్రైలర్‌ ను చూస్తుంటే అర్థం అవుతుంది. ఎన్నో సినిమాల అనుభవంతో దిల్‌ రాజు ఈ సినిమాను నిర్మించాడు. కనుక ఖచ్చితంగా సినిమా బాగుంటుందనే నమ్మకం తో ప్రేక్షకులు ఉన్నారు. మరి హీరోగా ఆశిష్ రెడ్డి కు మొదటి విజయం దక్కుతుందా అనేది మరి కొన్ని రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ సినిమా కు ప్రథాన పోటీ బంగార్రాజు. మరి ఆ పోటీని ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా చూడాలి.