Begin typing your search above and press return to search.

నయా రికార్డ్ క్రియేట్ చేసిన 'పుష్ప' ఫస్ట్ సింగిల్..!

By:  Tupaki Desk   |   25 Aug 2021 8:00 AM IST
నయా రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప ఫస్ట్ సింగిల్..!
X
అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మొదటి భాగం 'పుష్ప: ది రైజ్' పేరుతో క్రిస్‌మస్ పండుగ కానుకగా డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్ 'దాక్కో దాక్కో మేక' లిరికల్ వీడియో సోషల్ మీడియాలో నయా రికార్డులు క్రియేట్ చేస్తోంది.

రాక్‌ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన 'దాక్కో దాక్కో మేక' పాటను ఐదు భాషల్లో ఐదుగురు ప్రముఖ సింగర్స్ ఆలపించారు. ఆగస్ట్ 13న ఒకేసారి వివిధ భాషల్లో విడుదల చేయబడిన ఈ సాంగ్.. విశేష స్పందన తెచ్చుకుంటోంది. గడిచిన 11 రోజుల్లో అన్ని భాషల్లోనూ ఈ పాట యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. తెలుగు వెర్షన్ ట్రెండింగ్ లో నెం.1 పొజిషన్ లో నిలవడం విశేషం. అలానే కన్నడ వర్షన్ సాంగ్ 9వ స్థానంలో.. తమిళ వర్షన్ 11వ స్థానంలోనూ.. మలయాళ వర్షన్ 17వ స్థానంలో ఉన్నాయి.

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సాంగ్ నాలుగు భాషల్లో ఇలా 11 రోజుల పాటు ట్రెండింగ్ లో ఉండటం ఆల్ టైమ్ రికార్డుగా 'పుష్ప' టీమ్ చెబుతోంది. 'దాక్కో దాక్కో మేక' పాట తెలుగు వెర్సన్ కు గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించగా.. సింగర్ శివమ్ ఆలపించారు. ఇక హిందీలో విశాల్‌ దడ్లాని.. కన్నడంలో విజయ ప్రకాష్‌.. తమిళంలో బెన్నీ దయాల్‌.. మలయాళంలో రాహుల్‌ నంబియార్‌ ఈ పాట పాడారు.

'దాక్కో దాక్కో మేక' పాట ఆడియో పరంగానే కాకుండా విజువల్ గా కూడా వీక్షకులకు మంచి అనుభూతి ఇచ్చింది. అల్లు అర్జున్ లుక్ - హావభావాలు - వెరైటీ స్టెప్పులు ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. గణేష్ ఆచార్య మాస్టర్ ఈ సాంగ్ కు కొరియోగ్రఫీ చేశారు. ఆస్కార్ విన్నర్ రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేయగా.. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందించారు. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కాగా, 'పుష్ప' చిత్రంలో అల్లు అర్జున్ సరసన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తోంది. మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు. ప్రకాష్ రాజ్ - జగపతిబాబు - ధనుంజయ్ - సునీల్ - అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అల్లు అర్జున్ - సుకుమార్ లు కలిసి చేస్తున్న ఈ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.