Begin typing your search above and press return to search.

'యూట్యూబ్'లో రికార్డులు బ్రేక్ చేస్తున్న పుష్పారాజ్..!

By:  Tupaki Desk   |   19 April 2021 3:32 PM GMT
యూట్యూబ్లో రికార్డులు బ్రేక్ చేస్తున్న పుష్పారాజ్..!
X
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ పుష్ప. అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్బంగా ఏప్రిల్ 7న చిత్రబృందం సినిమా నుండి హీరో ఇంట్రడక్షన్ వీడియో రిలీజ్ చేసింది. ప్రస్తుతం పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో యూట్యూబ్ వేదికగా రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకుంటుంది. ఇప్పటికే పుష్పారాజ్ ఇంట్రడక్షన్ వీడియో.. రెండు రోజుల్లో 30 మిలియన్స్ వ్యూస్ రాబట్టగా.. ఇప్పటికి అంటే పదకొండు రోజుల్లో 44మిలియన్స్ వ్యూస్ తో పాటు 1.2మిలియన్ లైక్స్ దక్కించుకొని ట్రెండింగ్ లో ఉంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సొంతం చేసుకున్న వీడియోగా పుష్పారాజ్ వీడియో రికార్డు దక్కించుకుంది. అయితే ఇప్పటికి యూట్యూబ్ ట్రెండింగ్ వీడియోలలో పుష్పారాజ్ అగ్రస్థానంలో ఉండటం విశేషం.

“ది ఇంట్రడక్షన్ ఆఫ్ పుష్పా రాజ్” పేరుతో వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చిందని చెప్పాలి. అయితే యూట్యూబ్ ఇంట్రడక్షన్ వీడియోలలో పుష్పారాజ్ స్టార్ హీరోలను బీట్ చేసింది. ఆర్ఆర్ఆర్ సినిమా నుండి 'రామరాజు ఫర్ భీమ్' వీడియో 44మిలియన్స్ అందుకోడానికి 40రోజులు టైం పట్టింది. అయితే అత్యంత వేగంగా ఈ రికార్డును బ్రేక్ చేసింది పుష్పారాజ్ వీడియో. ఈ వీడియో సోషల్ మీడియాలో #Thaggedhele అనే హ్యాష్‌ట్యాగ్‌తో వైరల్ అయింది. తగ్గేదేలే అనేది సినిమాలోని ఓ డైలాగ్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఆగష్టు 13న సినిమా థియేట్రికల్ రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్.