Begin typing your search above and press return to search.

పుష్ప‌క విమానం.. క్లాసిక్ అనిపించాలి కొండా!

By:  Tupaki Desk   |   27 Oct 2021 8:32 AM GMT
పుష్ప‌క విమానం.. క్లాసిక్ అనిపించాలి కొండా!
X
ఆనంద్ దేవ‌ర‌కొండ క‌థానాయ‌కుడిగా యువ ద‌ర్శ‌కుడు దామోద‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో `పుష్ప‌క విమానం` తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ఆనంద్ కూడా ఆరంగేట్ర‌ హీరోగా నిరూపించుకోవ‌డంతో సినిమాపై పాజిటివ్ టాక్ ఉంది. ఇందులో మిడిల్ క్లాస్ అబ్బాయి పాత్ర‌లో ఆనంద్ క‌నిపించ‌నున్నాడు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చారం చిత్రాలు సినిమాకు బ‌జ్ తీసుకొచ్చాయి. ఇది చ‌క్క‌ని ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ అని ప్ర‌చార చిత్రాల్ని బ‌ట్టి తెలుస్తోంది. క్లాసిక్ టైటిల్ తోనే సినిమాకు బోలెడంత ప్ర‌చారం ల‌భించింది. ఇక సినిమా అన్ని ప‌నులు పూర్తిచేసుకుని రిలీజ్ కి రెడీ అవుతోంది.

న‌వంబ‌ర్ 12న వ‌ర‌ల్డ్ వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. సినిమా బిజినెస్ కూడా బాగానే జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే అన్ని ఏరియాల నుంచి బిజినెస్ డీల్స్ ని క్లోజ్ చేసిన‌ట్లు యూనిట్ తెలిపింది. ఆంధ్రా-సీడెడ్ లో సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ రిలీజ్ చేస్తుంది. అలాగే నైజాంలో గ్లోబ‌ల్ సినిమాస్ ద్వారా పెద్ద ఎత్తున రిలీజ్ అవుతుంది. ఇక ఓవ‌ర్సీస్ లో ఫ్రీజ్ ప్రేమ్ ఫిలింస్ రిలీజ్ చేస్తుంది. ఇలా మూడు ఏరియాల్లో పెద్ద డిస్ట్రిబ్యూష‌న్ సంస్థ‌ల ద్వారా `పుష్ప‌క విమానం` రిలీజ్ అవుతుండం విశేషం. రిలీజ్ కి ఇంకా ప‌ది రోజులే స‌మ‌యం ఉండ‌టంతో ప్ర‌చారంలో బిజీ అయింది. ర‌క‌ర‌కాల మీడియా ఇంట‌ర్వ్యూల్లో టీమ్ బిజీ అయిన‌ట్లు తెలుస్తోంది.

ఇందులో ఆనంద్ కి జోడీగా గీత్ సైని - శాన్వి మేఘన హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇది సినిమాకు మ‌రో అస్సెట్ గా నిలిచింది. విజ‌య్ కి ఉన్న గుర్తింపు ఈ సినిమాకు అద‌న‌పు బ‌లం అని చెప్పొచ్చు. ``కింగ్ అఫ్ ది హిల్`` ప్రొడక్షన్ - టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గోవర్ధన్ రావు దేవరకొండ – విజయ్ దషి – ప్రదీప్ ఎర్రబెల్లి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.