Begin typing your search above and press return to search.

క్రేజీ అప్డేట్ వదిలిన 'పుష్పకవిమానం' హీరో..!

By:  Tupaki Desk   |   28 Jun 2021 6:34 AM GMT
క్రేజీ అప్డేట్ వదిలిన పుష్పకవిమానం హీరో..!
X
సినీ ఇండస్ట్రీలో ఒకే ఇంట్లో నుండి హీరోలు ఎంతమంది వచ్చినా ఒక్కొక్కరి కెరీర్ ఒక్కోలా ఉంటుంది. ఎందుకంటే ప్రతి హీరో హిట్స్ అందుకోలేడు. ప్రతి హీరో సక్సెస్ వే లోనే ఉండలేరు. అప్స్ అండ్ డౌన్స్ అనేవి మాములే. కానీ ఎన్ని సినిమాలు చేసినా ఎలాంటి సినిమాలు చేశారు అనేది చూస్తుంటారు ప్రేక్షకులు. ఎందుకంటే ఈరోజుల్లో సినిమా స్టైల్ అనేది మారిపోయింది. ఇదివరకటిలా రొటీన్ స్టోరీస్.. ఎమోషన్స్ జనాలకు బొత్తిగా నచ్చడం లేదు. అయితే స్టార్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద దేవరకొండ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాడు.

ప్రస్తుతం ఆనంద్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ వేరే సినిమాలలో సపోర్టింగ్ క్యారెక్టర్స్ పోషించి ఆ తర్వాత హీరోగా మారి స్టార్ స్టేటస్ అందుకున్నాడు. కానీ ఆనంద్ వేరే హీరోలతో నటించకుండా దొరసాని అనే సినిమాతో డైరెక్ట్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ ఓరియెంటెడ్ కాన్సెప్ట్ 'మిడిల్ క్లాస్ మెలోడీస్' అనే సినిమాతో మళ్లీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ సినిమా ఓటిటి రిలీజ్ అయింది.

తాజాగా 'పుష్పకవిమానం' సినిమాతో రెడీ అయిపోయాడు ఆనంద్. డెబ్యూ దర్శకుడు దామోదర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో గీతా సైని - శాన్వి మేఘన హీరోయిన్స్ కాగా విజయ్ దేవరకొండ సమర్పణలో 'కింగ్ ఆఫ్ ది హిల్' ప్రొడక్షన్ - టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా తన రోల్ గురించి ఆనంద్ పలు విషయాలు బయటపెట్టాడు. "ఈ సినిమాలో నేనొక గవర్నమెంట్ స్కూల్ మాథ్స్ టీచర్ రోల్ చేసాను. మనం మాములుగా లెక్కలమాస్టర్ అంటుంటాం. అయితే చాలా ఇన్నోసెంట్ రోల్ అది. అరెంజ్ మ్యారేజ్ కారణంగా లైఫ్ ఎలాంటి మలుపులు తిరిగింది అనేది ఇంటరెస్టింగ్ గా ఉంటుంది." అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆనంద్.