Begin typing your search above and press return to search.

పుష్ప‌.. మైత్రి నుంచి ఏమిటా కీల‌క ప్ర‌క‌ట‌న‌?

By:  Tupaki Desk   |   8 Nov 2020 6:00 PM GMT
పుష్ప‌.. మైత్రి నుంచి ఏమిటా కీల‌క ప్ర‌క‌ట‌న‌?
X
లాక్ డౌన్ స‌మ‌యంలో #పుష్ప ట్రెండింగ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికిప్పుడు పాన్ ఇండియా సినిమాల సంద‌డి.. బ‌యోపిక్ ల సంద‌డి.. వెబ్ సిరీస్ ల సంద‌డి .. బిగ్ బాస్ సందడి.. ఇలా ర‌క‌ర‌కాల సంద‌ళ్ల న‌డుమ పుష్ప మూవీకి సంబంధించిన ప్ర‌తి అప్ డేట్ కూడా అంతే ఆస‌క్తిని క‌లిగించాయి. అల వైకుంఠ‌పుర‌ములో లాంటి ఇండ‌స్ట్రీ రికార్డ్ హిట్ త‌ర్వాత బ‌న్ని న‌టిస్తున్న సినిమాగా పుష్ప‌కి మంచి క్రేజ్ ఏర్ప‌డింది.

వీట‌న్నిటినీ మించి ఆర్య సుకుమార్ తో బ‌న్ని సినిమా అన‌గానే అంద‌రి క‌ళ్లు అటువైపే. పైగా ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజు పాపులారిటీ ఉన్న గంధ‌పు చ‌క్క‌ల స్మ‌గ్ల‌ర్ల పై సుక్కూ సినిమా తీస్తుండడం స‌ర్వ‌త్రా ఆస‌క్తిని పెంచుతోంది.

అయితే ఇంత క్యూరియాసిటీ ఉన్న ఈ మూవీ ఎప్పుడు మొద‌ల‌వుతుంది? అన్నదానిపై ప్ర‌తిసారీ క్లారిటీ మిస్స‌వుతోంది. ఇదిగో పులి అంటే అదిగో మేక అన్న‌ట్టుగానే ఉంది ప‌రిస్థితి. ఈ మూవీ తొలి షెడ్యూల్ ఎక్క‌డ ప్రారంభిస్తున్నారు? అన్న‌దానికి ర‌క‌ర‌కాల ప్ర‌చారం సాగుతోంది. గోదారి ప‌రిస‌రాల్లో మారేడుమిల్లి అడ‌వుల్లో తొలి షెడ్యూల్ చేస్తార‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది కానీ మైత్రి సంస్థ ఇంత‌వ‌ర‌కూ దేనినీ అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

దీనిపై అభిమానులు గుర్రుగా ఉన్నారు. ఎట్ట‌కేల‌కు అన్నిర‌కాల స‌స్పెన్స్ కి తెర దించుతూ సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే పుష్ప పై క్లారిటీగా ప్ర‌క‌ట‌న వెలువ‌రిస్తామ‌ని మైత్రి సంస్థ అధికారికంగా ప్ర‌క‌టించింది. అలాగే ఈ మూవీలో బ‌న్నీకి ధీటైన మాస్ విల‌న్ ని సుకుమార్ వెతికారా లేదా? అన్న‌దానిపై అధికారికంగా ఏదైనా చెబుతారా? అన్న‌ది కూడా స‌స్పెన్స్ గా మారింది. బన్ని అభిమానుల్లో దీనిపైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. మ‌రి ఇక‌నైనా అన్నిర‌కాల స‌స్పెన్స్ కి తెర దించేస్తారా లేదా? చూడాలి.