Begin typing your search above and press return to search.

పుష్ప వర్సెస్‌ పోలీసులు... అప్పుడు మాస్క్ ఇప్పుడు హెల్మెట్‌

By:  Tupaki Desk   |   18 Jan 2022 3:53 PM IST
పుష్ప వర్సెస్‌ పోలీసులు... అప్పుడు మాస్క్ ఇప్పుడు హెల్మెట్‌
X
ఈమద్య కాలంలో సోషల్‌ మీడియాలో పోలీసులు ట్రాఫిక్‌ రూల్స్ గురించి క్రియేటివిటీగా ప్రచారం చేస్తున్నారు. హీరోలతో ట్రాఫిక్‌ రూల్స్ చెప్పిస్తే వింటారనే ఉద్దేశ్యంతో ఫిల్మ్‌ స్టార్స్ మరియు ఫిల్మ్‌ సెలబ్రెటీలతో ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పిన పోలీసులు ఇప్పుడు కొత్త పద్దతిన స్టార్‌ హీరోల పోస్టర్ లను వినియోగించి ట్రాఫిక్‌ రూల్స్ ను ప్రచారం చేస్తున్నారు. స్టార్ హీరోలు బైక్ మీద వెళ్లే ఫోటో కనిపిస్తే చాలు వెంటనే ఆ పోస్టర్ కు హెల్మెట్‌ తగిలించి ఏదో ఒక క్యాప్షన్ ను పెడుతున్నారు. తద్వారా ఆ పోస్టర్ కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యి అందరికి ట్రాపిక్ రూల్స్ పై ఎంతో కొంత అవగాహణ మరియు హెల్మెట్‌ పెట్టుకోవాలనే కొంతలో కొంత అయినా బాధ్యత కలుగుతుందని పోలీసులు చెబుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌ పోలీసులు తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాలని పుష్ప పోస్టర్ ను పెట్టి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారు. పుష్ప పోస్టర్ కు మాస్క్ ను పెట్టి మాస్‌ పెట్టుకునే విషయంలో తగ్గేదే లే అన్నట్లుగా హైదరాబాద్‌ పోలీసులు జనాలను హెచ్చరించారు. ఒక వేళ మాస్క్ పెట్టుకోకుంటే కఠిన చర్యలు అన్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇప్పుడు పుష్ప కు ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. గత నెల రెండు నెలలుగా సోషల్‌ మీడియాలో ఎక్కడ చూసినా కూడా పుష్ప గురించే చర్చ జరుగుతుంది. కనుక ఈ సమయంలో పుష్ప పేరుతో ఏదైనా ప్రమోట్‌ చేసుకోవచ్చు అనే ఉద్దేశ్యంతో పలువురు పుష్ప ను తెగ వాడేసుకుంటున్నారు. ఎప్పటిలాగే హైదరాబాద్‌ పోలీసులు మళ్లీ పుష్ప బైక్ మీద వెళ్తున్న పోస్టర్‌ ను వాడేశారు.

అప్పుడు మాస్క్ ను పుష్ప పోస్టర్ కు పెట్టి మాస్క్‌ పెట్టుకోకుంటే తగ్గేదే లే అన్నట్లుగా పోస్ట్‌ చేశారు. ఇప్పుడు హెల్మెట్‌ తప్పనిసరి.. తగ్గేదే లే.. అంటూ బన్నీ మాస్‌ బైక్ డ్రైవ్ చేస్తున్న ఫొటోను షేర్ చేశారు. పోలీసులు చాలా క్రియేటివిటీతో హీరోలకు ఇలాంటి పోస్టర్‌ లను క్రియేట్‌ చేయడం ద్వారా ట్రాఫిక్ పై జనాల్లో అవగాహణ కలుగుతుందని నెటజిన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఆ హీరో ఫ్యాన్స్‌ కు మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ ఫొటోలు రీచ్ అవ్వడం.. తద్వార హెల్మెట్‌ పెట్టుకోవాలనే ఆలోచన కలగడం జరుగుతుందని నెటిజన్స్‌ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప వర్సెస్ టీఎస్ పోలీసులు.. ఈ పోస్టర్ ల వ్యవహారం ఏదో చాలా బాగుందని అల్లు అర్జున్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప ఒక్క పోస్టర్ తో రకరకాలుగా పోలీసులు జనాల్లో అవగాహణ కల్పించేందుకు ప్రయత్నాలు చేయడం గౌరవం అన్నట్లుగా వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.