Begin typing your search above and press return to search.

టాప్ గేర్ లో వ‌స్తున్న పుష్ప విల‌న్!

By:  Tupaki Desk   |   8 Sep 2022 9:30 AM GMT
టాప్ గేర్ లో వ‌స్తున్న పుష్ప విల‌న్!
X
మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో విభిన్న‌మైన సినిమాల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న హీరో ఫ‌హ‌ద్ ఫాజిల్‌. హీరోగా, విల‌న్‌గాచ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గానూ త‌న స‌త్తా చాటుకుంటూ త‌న‌దైన న‌ట‌న‌తో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుంటున్నాడు. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో బ్యాక్ టు బ్యాక్ విభిన్న‌మైన క‌థ‌ల‌తో సూపర్ హిట్ ల‌ని సొంతం చేసుకుంటున్న వెర్స‌టైల్ ఆర్టీస్ట్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంటూ న‌టుడిగా టాప్ గేర్ లో దూసుకుపోతున్నాడు.

తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల సినిమాల్లో ప్రాధాన్య‌త‌న వున్న పాత్ర‌ల్లో న‌టిస్తూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్న ఫ‌హ‌ద్ ఫాజిల్ గ‌త ఏడాది అల్లు అర్జున్ న‌టించిన 'పుష్ప ది రైజ్‌' మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌య‌మ‌య్యాడు. భ‌న్వ‌ర్ సింగ్ షెకావ‌త్ పాత్ర‌లో ఫ‌హ‌ద్ న‌టించిన తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఆక‌ట్టుకుంది. త్వ‌ర‌లో పార్ట్ 2 ప్రారంభం కాబోతోంది. ఇందులో ఫ‌హ‌ద్ పాత్ర మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా, క్రుయ‌ల్ గా వుంటుంద‌ని తెలుస్తోంది.

ఇక యూనివ‌ర్స‌ల్ స్టార్ క‌మ‌ల్ హాస‌న్ దాదాపు నాలుగేళ్ల విరామం త‌రువాత న‌టించిన 'విక్ర‌మ్‌' మూవీలో ఏజెంట్ అమ‌ర్ గా న‌టించి మంచి మార్కులు కొట్టేశాడు. ఈ మూవీతో తెలుగులోనూ ఫ‌హ‌ద్ కు మంచి గుర్తింపు ల‌భించింది.

ఇదిలా వుంటే ఇటీవ‌ల 'మాలిక్‌', రెడ్ వైన్‌, దొంగాట వంటి సినిమాల‌తో ఆహా ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకున్న ఫ‌హ‌ద్ తాజాగా సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో ఓ భారీ మూవీని చేస్తున్నాడు. 'టాప్ గేర్‌' పేరుతో రూపొందుతున్న ఈ మూవీకి సుధీర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సూప‌ర్ గుడ్ ఫిలింస్ బ్యాన‌ర్ లో రూపొందుతున్న 96వ చిత్రమిది.

శుక్రవారం సెప్టెంబ‌ర్ 9 నుంచి ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కానున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ గురువారం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ని విడుద‌ల చేశారు. ఫ‌హ‌ద్ లుంగీ ధ‌రించి జీప్ పై అటు వైపు గా నిల‌బ‌డి చుట్టూ వున్న జ‌నానికి రైట్ హ్యాండ్ ఎత్తి అభివాదం చేస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది.

ఫ‌స్ట్ లుక్ ని బ‌ట్టి చూస్తే హై వోల్టేజ్ యాక్ష‌న్ డ్రామాగా ఈ మూవీని తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. త్వ‌ర‌లోనే చిత్ర బృందం ఈ మూవీకి సంబంధించిన న‌టీన‌టులు, సాంతికేతిక నిపుణుల వివ‌రాల్ని వెల్ల‌డించ‌నున్న‌ట్టుగా తెలిసింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.