Begin typing your search above and press return to search.

రేపు 10 గంటలకు 'పుష్ప' అప్‌ డేట్‌

By:  Tupaki Desk   |   8 Nov 2020 3:01 PM GMT
రేపు 10 గంటలకు పుష్ప అప్‌ డేట్‌
X
అల్లు అర్జున్‌ అల వైంకుఠపురంలో సినిమా తర్వాత చేస్తున్న సినిమా అవ్వడంతో పుష్ప సినిమాపై అప్పటికే మెగా ఫ్యాన్స్‌ తో పాటు దాదాపు తెలుగు ప్రేక్షకులందరికి కూడా భారీ అంచనాలున్నాయి. సుకుమార్‌ దర్శకత్వం వహించబోతుండటం వల్ల ఆ అంచనాలు మరింతగా పెరిగాయి అనడంలో సందేహం లేదు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌ లుక్‌ సినిమా గురించి వచ్చిన వార్తలు సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అంటూ ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది. అయితే కరోనా కారణంగా మార్చిలో మొదలు అవ్వాల్సిన షూటింగ్‌ ఇంకా కూడా మొదలు కాలేదు.

అదుగో ఇదుగో అంటూ గత నెల రెండు నెలలుగా దాట వేస్తూ వస్తున్నారు. ఒకానొక సమయంలో ఫ్యాన్స్‌ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఆలస్యం చేయకుండా పుష్ప షూటింగ్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు ప్రకటించేందుకు సిద్దం అయ్యారు. రేపు ఉదయం 10 గంటలకు ఒక వీడియోను విడుదల చేయబోతున్నారు. సినిమా ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ఎలా జరిగాయి అనే విషయాన్ని చూపించడంతో పాటు సినిమా షూటింగ్‌ ఎక్కడ ఎప్పటి నుండి ప్రారంభించబోతున్న విషయాన్ని కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. రేపటి వీడియో కోసం బన్నీ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.