Begin typing your search above and press return to search.

పుష్ప కోసం వర్మ మూవీ స్టార్‌

By:  Tupaki Desk   |   17 April 2020 10:19 PM IST
పుష్ప కోసం వర్మ మూవీ స్టార్‌
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో విలన్‌ పాత్రకు గాను బాలీవుడ్‌ స్టార్‌ నటుడు సునీల్‌ శెట్టి లేదా సంజయ్‌ దత్‌ ను తీసుకునే అవకాశం ఉందని ఇటీవలే వార్తలు వచ్చాయి. తాజాగా మరోసారి పుష్ప విషయమై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పుష్ప చిత్రం నుండి విజయ్‌ సేతుపతి తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్న ఈ సమయంలోనే కన్నడ నటుడు దాలి దనంజయ్‌ ను ఈ చిత్రంలో ఎంపిక చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది.

రామ్‌ గోపాల్‌ వర్మ భైరవ గీత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన దనంజయ్‌ తో తాజాగా దర్శకుడు సుకుమార్‌ చర్చలు జరిపారట. కన్నడంలో ఈ సినిమాను మార్కెట్‌ చేయడం కోసం సుకుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడనే చర్చ జరుగుతోంది. భైరవ గీత చిత్రంలో ఈయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే ఈ సినిమాలో దనంజయ్‌ ను తీసుకోవాలనే ఉద్దేశ్యంతో సుకుమార్‌ ఉన్నట్లుగా చెబుతున్నారు.

పుష్ప చిత్రాన్ని తెలుగులోనే కాకుండా మరో నాలుగు భాషల్లో కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు. అందుకే అన్ని చోట్ల కూడా మంచి బిజినెస్‌ చేసేందుకు ఇలా ఇతర భాషల నటీనటులను ఈ చిత్రం కోసం తీసుకుంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రం ను ఈ లాక్‌ డౌన్‌ పూర్తి అయిన వెంటనే మొదలు పెట్టబోతున్నారు. వచ్చే ఏడాది లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశం ఉంది.