Begin typing your search above and press return to search.

ఎట్టకేలకు కేరళ ప్రయాణమైన పుష్ప

By:  Tupaki Desk   |   17 Feb 2021 2:30 PM GMT
ఎట్టకేలకు కేరళ ప్రయాణమైన పుష్ప
X
గత ఏడాది ఆరంభంలో అల్లు అర్జున్‌ పుష్ప సినిమా షూటింగ్ కోసం కేరళ వెళ్లేందుకు సిద్దం అవుతున్న సమయంలో కరోనా కారణంగా ఆ షెడ్యూల్‌ క్యాన్సిల్‌ అయ్యింది. కేరళలో పుష్ప సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించాలని భావించినా కూడా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేరళ వెళ్లలేక పోయిన పుష్ప యూనిట్ సభ్యులు ఎట్టకేలకు అక్కడ షెడ్యూల్‌ కు సిద్దం అయ్యారు. కేరళలో చేయాల్సిన సీన్స్ ను ఇప్పటికే ఏపీలో ని అటవి ప్రాంతంలో చేశారనే టాక్ వచ్చింది. అయినా కూడా బన్నీ అండ్‌ యూనిట్‌ సభ్యులు కేరళకు వెళ్లారు. అక్కడ కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కీలక షెడ్యూల్‌ కోసం యూనిట్‌ సభ్యులు ఇప్పటికే కేరళ వెళ్లారు. బన్నీ నేడు కేరళ చేరుకున్నాడు. రేపటి నుండి షూటింగ్ లో బన్నీ పాల్గొంటాడనే సమాచారం అందుతోంది. భారీ అంచనాలున్న పుష్ప సినిమా కోసం సుకుమార్‌ విభిన్నమైన స్క్రీన్‌ ప్లే ను రాసుకున్నట్లుగా చెబుతున్నారు. రంగస్థలం మించి పుష్ప సినిమా మాస్ ఆడియన్స్‌ ను అలరిస్తుందనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. రష్మిక మందన్నా హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ సినిమా ను ఆగస్టు 13న ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్న విషయం తెల్సిందే. కేరళలో షెడ్యూల్‌ పూర్తి అయిన తర్వాత మార్చి నుండి మళ్లీ హైదరాబాద్‌ లో కీలక సన్నివేశాల చిత్రీకరణ జరిపే అవకాశం ఉందంటున్నారు.