Begin typing your search above and press return to search.

కోలుకున్న సుకుమార్‌.. పుష్ప రీ స్టార్ట్‌

By:  Tupaki Desk   |   26 July 2021 10:59 AM GMT
కోలుకున్న సుకుమార్‌.. పుష్ప రీ స్టార్ట్‌
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప షూటింగ్ శరవేగంగా సాగుతున్న సమయంలో అర్థాంతరంగా ఆగిపోయింది. షూటింగ్ నిలిచి పోవడంతో రకరకాల ప్రచారాలు జరిగాయి. పుష్ప సినిమా షూటింగ్‌ కు బ్రేక్‌ పడటానికి కారణం సుకుమార్‌ కు అనారోగ్య సమస్యలే అంటూ యూనిట్‌ సభ్యుల ద్వారా సమాచారం అందింది. సుకుమార్‌ డెంగ్యూ ఫీవర్‌ తో బాధ పడ్డారని.. ఆయన ప్రస్తుతం పూర్తిగా కోలుకుని షూటింగ్‌ కు సిద్దం అయ్యారంటూ మీడియా వర్గాల కు పుష్ప టీమ్‌ నుండి లీడ్‌ వచ్చింది.

పుష్ప పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్ పెట్టుకుందామని అల్లు అర్జున్‌ అన్నారట. దాంతో సుకుమార్‌ కోలుకుని రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత నేటి నుండి షూటింగ్‌ పునః ప్రారంభం అయ్యింది. షూటింగ్‌ ను మళ్లీ కంటిన్యూస్ గా చేసేందుకు ఏర్పాట్లు జరిగాయి. పెద్ద ఎత్తున కాస్ట్‌ అండ్ క్రూ తో ప్రస్తుత షెడ్యూల్ ను చేస్తున్నారని సమాచారం. సుకుమార్‌ నేటి నుండి మళ్లీ పుష్ప షూటింగ్‌ ను మొదలు పెట్టడంతో ఇండస్ట్రీలో సందడి వాతావరణం మొదలయ్యిందని మెగా కాంపౌండ్‌ లో చర్చ జరుగుతోంది.

అల్లు అర్జున్ తో పాటు కీలక నటీనటులు మరియు సాంకేతిక నిపుణులు ఈ షెడ్యూల్‌ లో పాల్గొంటున్నారు. సుకుమార్‌ ఈ సినిమా ను రెండు పార్ట్‌ లుగా తెరకెక్కించబోతున్నారు. మొదటి పార్ట్‌ లో బన్నీ లుక్ మరియు పాత్ర తీరు ఎలా ఉంటుందో ఇప్పటికే తేలిపోయింది. ఇక ఈ మొదటి పార్ట్‌ ను సాధ్యం అయినంత వరకు ఈ ఏడాదిలోనే విడుదల చేయాలని భావిస్తున్నారు. థర్డ్‌ వేవ్‌ లేకుంటే ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు పుష్ప వస్తాడు. ఒక వేళ అనుకోని కారణాల వల్ల సినిమా ఆలస్యం అయితే వచ్చే ఏడాది ఆరంభంలో పుష్ప ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ రష్మిక మందన్న ఈ సినిమా లో అల్లు అర్జున్‌ కు జోడీగా నటిస్తుంది. అనసూయ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ స్టార్ నటుడు ఫాహద్‌ ఫాజిల్‌ మరియు సునీల్‌ లు విలన్ లుగా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్‌ గత చిత్రం రంగస్థలం తర్వాత అనూహ్యంగా ఎక్కువ గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్‌ ను ఫిల్‌ చేసేలా బ్యాక్ టు బ్యాక్‌ సినిమాలతో సుకుమార్‌ రాబోతున్నాడు. అంతే కాకుండా రంగస్థలం సినిమాను మించి ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అంటున్నారు.

మరో వైపు అల్లు అర్జున్‌ గత చిత్రం అల వైకుంఠపురంలో సినిమా సూపర్‌ డూపర్‌ సక్సెస్‌ అయ్యింది. కనుక ఈ సినిమా పై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. బన్నీని గతంలో ఎప్పుడు చూడని విధంగా ఈ చిత్రంలో చూడబోతున్నట్లుగా యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. బన్నీ సుక్కు ల కాంబోలో గతంలో వచ్చిన సినిమా లు భారీ విజయాలను సొంతం చేసుకున్నాయి. కనుక ఈ సినిమా తో హ్యాట్రిక్‌ ఖాయం అంటూ అభిమానులు నమ్మకంగా ఉన్నారు.