Begin typing your search above and press return to search.
బన్నీని ఆకాశానికెత్తేస్తున్న హిందీ మీడియా!
By: Tupaki Desk | 22 Feb 2022 6:00 AM ISTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ డిసెంబర్ లో విడుదలైంది. అప్పటి నుండి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తిరుగులేని హవా సాగిస్తూనే ఉంది. OTT లో విడుదలైనా ఈ చిత్రం ప్రేక్షకులను థియేటర్ లకు పదే పదే రప్పించడం కొనసాగించింది. పుష్ప మొత్తం కలెక్షన్లు రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు థియేటర్లలో తొమ్మిది వారాల రన్ తర్వాత ఈ సినిమా హిందీ వసూళ్ల హవా తగ్గిందని సమాచారం.
#పుష్ప: ది రైజ్ - పార్ట్ 1 బాక్సాఫీస్ పుష్ప థియేటర్ ఫుట్ పాల్స్ పరంగా సూర్యవంశీని ఫాలో చేసిందని తెలిసింది. తాజా బాక్సాఫీస్ రిపోర్ట్ ని పరిశలిస్తే.. పుష్ప: ది రైజ్ ఒక నెల ముందు విడుదలైన అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీతో పోల్చి చూడగా... థియేటర్ ఫుట్ ఫాల్స్ లో కొలమానాలు కనిపించాయట. రెండవ లాక్‌డౌన్ తర్వాత తెరపైకి వచ్చిన మొదటి బిగ్ టికెట్ బాలీవుడ్ ఎంటర్ టైనర్ అయిన సూర్యవంశీ 11 మిలియన్ ఫుట్ ఫాల్ లను నమోదు చేయగా.. ఒక నెల తర్వాత స్క్రీన్ లలోకి వచ్చిన పుష్ప: ది రైజ్ 13.10 మిలియన్ ఫుట్ ఫాల్స్ రికార్డ్ చేసింది.
అక్షయ్ కుమార్ నటించిన సూర్యవంశీ భారీ వసూళ్లను రాబట్టినా బాక్సాఫీస్ వద్ద 196 కోట్లు మాత్రమే వసూలు చేయగలిగింది. పుష్ప: ది రైజ్ హిందీలో డబ్ అయిన చిత్రం. అయినా 107.03 కోట్లు వసూలు చేసింది. కలెక్షన్ల పరంగా పుష్ప ఇప్పటికీ సూర్యవంశీ కంటే చాలా వెనుకబడి ఉన్నా ఒక అనువాద చిత్రానికి ఇది చాలా పెద్ద మొత్తం.
మంచి వినోదాత్మక సినిమా ఎల్లప్పుడూ క్రౌడ్ పుల్లర్ గా ఉంటుంది అనేదానికి పుష్ప చక్కని నిదర్శనం అని బాలీవుడ్ క్రిటిక్స్ పొగిడేస్తున్నారు. ఈ ఏడాదిలో సూర్యవంశీ తర్వాత `పుష్ప` ది బెస్ట్ అనిపించిన సినిమా. వసూళ్లను సాధించడంలో ఇప్పుడు బన్నీని బాలీవుడ్ అగ్ర హీరోలతో పోలుస్తున్నారు. ముఖ్యంగా ఉత్తరాది మీడియా బన్నీని ఆకాశానికెత్తేస్తోంది.