Begin typing your search above and press return to search.

#పుష్ప‌.. గోదారి చుట్టూ లంగ‌రేసిన సుక్కూ టీమ్

By:  Tupaki Desk   |   8 Nov 2020 5:00 AM GMT
#పుష్ప‌.. గోదారి చుట్టూ లంగ‌రేసిన సుక్కూ టీమ్
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టిస్తున్న తాజా యాక్ష‌న్ ఎంట‌ర్ ‌టైన‌ర్ `పుష్ప‌`. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో మైత్రీ మూవీమేక‌ర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. చాలా రోజులుగా అదిగో ఇదిగో అంటూ ఊరించిన ఈ మూవీ షూటింగ్ ఎట్ట‌కేల‌కు స్టార్ట్ కాబోతోంది. ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ ఆదివారం నుండి మారేడుమిల్లిలో ప్రారంభం కాబోతోంది. ఇందు కోసం బ‌న్నీఫ్లైట్ లో రాజ‌మండ్రి చేరుకున్నారు. శంషాబాద్ ఏయిర్ పోర్ట్ కు చేరుకున్న బ‌న్నీ చాలా కూల్ ‌గా క‌నిపించారు.

బ్లాక్ కూల్ టీష‌ర్ట్...‌, షార్ట్ ‌లో స్మాల్‌ హ్యాండ్ బ్యాగ్ తో బ‌న్నీ సింపుల్ ‌గా క‌నిపించాడు. షూటింగ్ స‌మ‌యంలో రాజ‌మండ్రిలో టీమ్‌ స్టే చేయ‌బోతోంది. ఇందుకు యూనిట్ కోసం రిసార్ట్ ‌తో పాటు కొన్ని హైఫై హోట‌ల్స్ ని బుక్ చేశార‌ట‌. ఇప్ప‌టికే టీమ్ అంతా క్వారెంటైన్ లో వుంటున్నార‌ట‌. ఇక్క‌డ కూడా అదే ప‌ద్ధ‌తిని పాటిస్తూ నెల రోజుల పాటు షూటింగ్ చేయ‌బోతున్న‌ట్టు తెలిసింది.

మారేడుమిల్లిలో ప‌లు యాక్ష‌న్ ఘ‌ట్టాల‌ని షూట్ చేయ‌బోతున్నార‌ట‌. ఇందు కోసం ఫైట్ మాస్ట‌ర్స్ రామ్ ల‌క్ష్మ‌ణ్ ఇప్ప‌టికే ఫైట్స్ కంపోజ్ చేసిన‌ట్టు తెలిసింది. లాక్ డౌన్ కార‌ణంగా గ‌త ఏడెనిమిది నెల‌లుగా ఆగిపోయిన ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నార‌ట‌. అది మెగాస్టార్ `ఆచార్య‌` రిలీజ్‌ని బ‌ట్టి ఈ మూవీ రిలీజ్ డేట్ ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు.