Begin typing your search above and press return to search.

సోషల్‌ మీడియా సందడి మొదలెట్టిన పుష్ప

By:  Tupaki Desk   |   16 Aug 2021 6:00 PM IST
సోషల్‌ మీడియా సందడి మొదలెట్టిన పుష్ప
X
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్‌ 1 నుండి ఇటీవల వచ్చిన మొదటి పాట దాక్కో దాక్కో మంచి స్పందన దక్కించుకుంది. తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ ను దక్కించుకుని సౌత్‌ ఇండియాలో ఇప్పటి వరకు ఏ సినిమా పాట కూడా దక్కించుకోని విధంగా స్పీడ్ గా వ్యూస్ ను దక్కించుకుంది. రికార్డు స్థాయిలో ఈ పాటకు సంబంధించిన వ్యూస్‌ వస్తుండటంతో పాటను మరింతగా పాపులర్ చేసేందుకు ట్రెండ్‌ చేసేందుకు ఇన్ స్టా గ్రామ్‌ లో రీల్స్ ను చేసేందుకు అభిమానులకు పిలుపునిచ్చారు. అహ్ అహ్ అహ్ స్టెప్ స్టెప్ కు మంచి స్పందన వచ్చింది. దాన్ని చాలా మంది రికార్డ్‌ చేసి షేర్‌ చేస్తున్నారు.

ఇప్పుడు ఆ స్టెప్పులను రీల్స్ గా చేయాల్సిందిగా ఇన్ స్టా గ్రామ్‌ లో సుకుమార్ టీమ్ పిలుపునిచ్చింది. పెద్ద ఎత్తున సోషల్‌ మీడియాలో ఈ పాటకు సంబంధించిన రీల్స్ రావాలని కోరుకుంటున్నారు. చాలా యూనిక్ స్టెప్పులు వేసే విధంగా ఆ మ్యూజిక్ ఉంది. కనుక తప్పకుండా సోషల్‌ మీడియాలో ఆ రీల్స్ రాబోయే రోజుల్లో వైరల్‌ అవ్వబోతున్నాయి అంటున్నారు. అమ్మాయిలు అబ్బాయిలు ఎవరికి తోచిన విధంగా వారు.. కొత్తగా ట్రై చేసి రీల్స్ చేయాల్సిందిగా పుష్ప టీమ్‌ మెంబర్స్ నుండి రీల్స్ స్టార్స్ కు సమాచారం అందిందని తెలుస్తోంది.

డిసెంబర్‌ లో క్రిస్మస్ కానుకగా విడుదల చేసేందుకు గాను పుష్ప ను రెడీ చేస్తున్నారు. సినిమా షూటింగ్ ను త్వరలోనే పూర్తి చేయబోతున్నారు. విడుదలకు ఇంకా చాలా సమయం ఉంది. అయినా కూడా ప్రేక్షకుల్లో సినిమా ను ట్రెండ్డింగ్‌ లో ఉంచాలంటే ఇలాంటివి అప్పుడప్పుడు చేయాల్సి ఉంటుంది. కనుక పుష్ప సినిమా కు చెందిన పాట మొదటి రీల్స్‌ ను మిలియన్స్ కొద్ది చేస్తే ఖచ్చితంగా సినిమాకు భారీ ఎత్తున స్పందన రావడం ఖాయం. జనాల్లో సినిమా ఎప్పటికి నిలిచి పోయేలా ఉండటంతో పాటు సినిమా షూటింగ్‌ ముగిసే వరకు సినిమా గురించి జనాల్లో చర్చ జరిగేలా ప్రమోషన్ కార్యక్రమాలు చేయాలని ఈ సందర్బంగా చిత్ర యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. అందుకే సోషల్‌ మీడియాలో పుష్ప పాట రీల్స్ ను చేయించే ఆలోచన చేసినట్లుగా తెలుస్తోంది.