Begin typing your search above and press return to search.

పెద్ద ఐస్ బ‌ర్గ్ లో చిన్న ముక్క చూపిస్తారా పుష్పా?

By:  Tupaki Desk   |   14 Aug 2021 2:30 AM GMT
పెద్ద ఐస్ బ‌ర్గ్ లో చిన్న ముక్క చూపిస్తారా పుష్పా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న పుష్ప ఫ‌స్ట్ సింగిల్ రిలీజ్ అయిన సంగ‌తి తెలిసిందే. వ‌స్తూనే బ‌న్నీ మాస్ సాంగ్ తో ప్రేక్ష‌కుల్లోకి వ‌చ్చేసారు. సాంగ్ ఆద్యంతం పుష్ప‌రాజ్ మాసిజాన్ని ఓరేంజ్ లో ఎలివేట్ చేసారు. దాక్కో దాక్కో మేక అంటూ సాంగే పాట ఆద్యంతం బ‌న్నీ ని హైలైట్ చేసారు. ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో జోరుగా ట్రెండ్ అవుతోంది. తొలి సింగిల్ తోనే బ‌న్నీ స‌త్తా చాటాడు. అభిమానుల రెట్టించిన ఉత్సాహంతో ఉన్నారు. షేర్లు..లైక్ ల‌తో పాట యూట్యూబ్ ని షేక్ చేస్తోంది. 24 గంట‌ల్లో ఎన్ని లైకులొచ్చాయి..ఎన్ని షేర్లు వ‌చ్చాయ‌న్న‌ది ఇక తెలియ‌నుంది. పాట‌పై ఇండ‌స్ట్రీ మొత్తం స్పందించి త‌మ‌దైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.

పుష్ప రాజ్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న కూడా ఆస‌క్తిక‌రంగా స్పందించింది. పెద్ద ఐస్ బ‌ర్గ్ లో చిన్న ముక్కను చూపించారంటూ ఒకింత అస‌హ‌నం వ్య‌క్తం చేసింది స‌ర‌దాగా. ఇది స‌రైన ప‌ద్ద‌తి కాదంటూ కామెంట్ చేసింది. పాట సూప‌ర్బ్.. అమేజింగ్ క్రేజీ స్ట‌ఫ్ అంటూ పాట‌ని అమాంతం ఆకాశానికి ఎత్తేసింది. ఇందులో ర‌ష్మిక గిరిజ‌న అమ్మాయి పాత్ర‌లో క‌నిపించ‌నుంది. పుష్ప‌రాజ్ భార్య పాత్ర‌లో ఆక‌ట్టుకోనుంద‌ని తెలుస్తోంది. పుష్ప‌ని రెండు భాగాలు తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మొద‌టి భాగం షూటింగ్ పూర్త‌యింది. దానికి సంబంధించిన ప్ర‌చారంలో భాగంగానే తొలి సింగిల్ రిలీజ్ అయింది.

ఇక రెండ‌వ భాగం షూటింగ్ కూడా అంతే వేగంగా జ‌రుగుతోంది. తొలి భాగాన్ని డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు. అనంత‌రం రెండ‌వ భాగం కూడా పెద్ద‌గా గ్యాప్ తీసుకోకుండా రిలీజ్ చేసే అవ‌కాశాలున్నాయి. పుష్ప చిత్రాన్ని స్టైలిష్ మేక‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. రెండు భాగాల లో మొద‌టి భాగం పుష్ప‌1 ద‌స‌రా కానుక‌గా రిలీజ‌వుతుంది. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ వేణు శ్రీరామ్ తెర‌కెక్కించ‌నున్న `ఐకాన్` షూటింగ్ పాల్గొంటారు.