Begin typing your search above and press return to search.

వేయిమంది డాన్సర్లతో దుమ్మురేపేస్తున్న 'పుష్ప'రాజ్

By:  Tupaki Desk   |   4 Nov 2021 4:58 PM IST
వేయిమంది డాన్సర్లతో దుమ్మురేపేస్తున్న పుష్పరాజ్
X
అల్లు అర్జున్ - రష్మిక జంటగా సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మొదటిభాగాన్ని డిసెంబర్ 17వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. అడవి నేపథ్యంలో జరిగే అవినీతి .. అడవి సాక్షిగా సాగే అందమైన ప్రేమకథను కలుపుకుంటూ ఈ కథ నడుస్తుంది. కథను .. కెమెరాను పట్టుకుని ఈ సినిమా టీమ్ కాలు బయటికి పెట్టిన దగ్గర నుంచి వచ్చిన ప్రతి అప్ డేట్ ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా నుంచి వదిలిన పుష్ప రాజ్ గా అల్లు అర్జున్ లుక్ .. శ్రీవల్లిగా రష్మిక లుక్ .. భన్వర్ సింగ్ గా ఫాహద్ ఫాజిల్ లుక్ .. సినిమాపై మరింతగా అంచనాలు పెంచుతున్నాయి. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవనుంది. ఇంతవరకూ ఈ సినిమా నుంచి వదిలిన 'దాక్కో దాక్కో మేక' .. 'శ్రీవల్లీ' .. 'సామీ .. సామీ' పాటలు కొత్త రికార్డులను సెట్ చేస్తూ దూసుకుపోతున్నాయి. అడవిలోని అందగాడికి .. గూడెంలోని చిన్నదానికి మధ్య జరిగే ప్రేమకథ కావడం వలన, వరుసగా మాస్ సాంగ్స్ దుమ్మురేపేస్తున్నాయి.

ఇప్పుడు అదే తరహాలో మరో పాటను గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరిస్తున్నారు. లొకేషన్ కి సంబంధించిన ఒక ఫోటోను దీపావళి కానుకగా ఈ సినిమా టీమ్ షేర్ చేసింది. 'పుష్ప' కోసం ఒక పాటను చిత్రీకరిస్తున్నట్టుగా చెప్పింది. అల్లు అర్జున్ బుల్లెట్ పై కూర్చుని కనిపిస్తున్నాడు. ఈ పాటలో అల్లు అర్జున్ తో పాటు వేయిమంది డాన్సర్లు పాల్గొంటున్నట్టు చెప్పారు. అక్కడ కనిపిస్తున్న గ్రామీణ నేపథ్యం చూస్తుంటే, ఇది కూడా మాస్ సాంగ్ అనే తెలుస్తోంది. అల్లు అర్జున్ అభిమానులకు పండగ చేసే పాటేనని అర్థమవుతోంది.

సుకుమార్ ఇంతకుముందు తాను చేసిన 'నాన్నకు ప్రేమతో' సినిమాలోను, 'రంగస్థలం' సినిమాలోను జగపతిబాబుకి పవర్ఫుల్ రోల్స్ ఇచ్చాడు. ఆ పాత్రలు ఆయనకి ఎంతో గుర్తింపును తెచ్చిపెట్టాయి. అలాగే ఈ సినిమాలోనూ ఆయన జగపతిబాబుకి ఒక కీలకమైన పాత్రను ఇచ్చాడు. ఆయన పాత్ర ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. ఇక ఓ ముఖ్యమైన పాత్రలో అనసూయ కనిపించనుంది. 'రంగస్థలం' సినిమాలో రంగమ్మత్త పాత్రలో ఆమె ఏ స్థాయిలో మెప్పించిందనేది అందరికీ తెలిసిందే.