Begin typing your search above and press return to search.

వాళ్ల నోళ్లు మూయించిన పుష్ప

By:  Tupaki Desk   |   22 Dec 2021 8:31 AM GMT
వాళ్ల నోళ్లు మూయించిన పుష్ప
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొంది ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చిన పుష్ప సినిమా భారీ ఓపెనింగ్స్‌ ను దక్కించుకుంది. పాన్ ఇండియా రేంజ్‌ లో విడుదల అయిన ఈ సినిమాకు మొదటి రోజు మిశ్రమ స్పందన దక్కింది. ముఖ్యంగా బాలీవుడ్‌ లో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్‌ ను రాబట్టలేక పోయింది అంటూ కొందరు ట్రోల్స్ చేయడం మొదలు పెట్టారు. సినిమా మొదటి రోజు కనీసం 20 శాతం ఆక్యుపెన్సీని కూడా దక్కించుకోలేక పోయిందని ప్రచారం చేశారు. వారందరి నోళ్లు మూయించేలా ఉత్తరాది పుష్ప కలెక్షన్స్ ఉన్నాయంటూ బాక్సాఫీస్ నుండి వస్తున్న రిపోర్ట్‌ లు ఉన్నాయంటున్నారు. వీకెండ్స్ లో మాత్రమే కాకుండా వీక్ డేస్ లో కూడా ఏమాత్రం తగ్గేదే లే అన్నట్లుగా పుష్ప రాజ్ వసూళ్లు భారీగా రాబడుతున్నాడు.

తెలుగు రాష్ట్రాల్లో మరియు కేరళలో బన్నీకి ఉన్న క్రేజ్ నేపథ్యంలో భారీ వసూళ్లు చాలా కామన్ విషయం. కాని పుష్ప సినిమా తమిళం.. కన్నడం మరియు హిందీ వర్షన్ ల్లో కూడా భారీ వసూళ్లు నమోదు చేస్తుంది. సినిమా విడుదల సమయంలో అభిమానులు 250 కోట్ల వసూళ్లు ఖాయం అన్నట్లుగా నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు లెక్కలు చూస్తుంటే ఇంకాస్త ఎక్కువే వసూళ్లు నమోదు అయ్యే అవకాశం కనిపిస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు. అల్లు అర్జున్‌ కెరీర్‌ ఆల్‌ టైమ్ హై వసూళ్లు పుష్పకు నమోదు అవ్వబోతున్నాయి అంటున్నారు. సినిమా విడుదల అయ్యి అయిదు రోజులు అవుతున్నా కూడా జోరు మాత్రం తగ్గడం లేదు.

పుష్ప హిందీ వర్షన్‌ డిజాస్టర్ అంటూ కొందరు చేసిన ప్రచారం సినిమా వసూళ్ల పై ప్రభావం చూపించలేదు. విమర్శలు చేసిన ప్రతి ఒక్కరి నోళ్లు మూయించేలా పుష్ప అక్కడ ఇక్కడ వసూళ్లు ఉన్నాయి. కరోనా తర్వాత ఈ స్థాయి వసూళ్లు నమోదు అవ్వడం చాలా పెద్ద విషయం. ఇండియాస్ బాక్సాఫీస్‌ ను ఈ సినిమా షేక్ చేస్తోంది. అద్బుతమైన పుష్ప రాజ్ వసూళ్లను చూస్తుంటే పార్ట్‌ 2 ను త్వరగా చేయాలని ఉందంటూ నిర్మాతల్లో ఒకరు చెప్పుకొచ్చారు. అల్లు అర్జున్‌ మాస్ డైలాగ్స్ మరియు ఆయన లుక్‌... సుకుమార్‌ టేకింగ్ సమంత ఐటెం సాంగ్ ఇలా ప్రతి ఒక్కటి కూడా సినిమాకు వందల కోట్ల వసూళ్లు నమోదు అయ్యేలా చేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. భారీ అంచనాల నడుమ రూపొందిన పుష్ప సినిమా అంచనాలను నిలబెట్టుకుందని వసూళ్లను చూస్తుంటే అనిపిస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. ఇక పుష్ప 2 ను వచ్చే ఏడాది ఆరంభంలోనే పట్టాలెక్కించబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.