Begin typing your search above and press return to search.

పుష్ప కాకుండా పుష్ప రాజ్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటి ?

By:  Tupaki Desk   |   26 Nov 2021 6:34 AM GMT
పుష్ప కాకుండా పుష్ప రాజ్ ఇవ్వబోతున్న సర్ప్రైజ్ ఏంటి ?
X
ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప సినిమా విడుదల తేదీ సమీపిస్తోంది. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలయ్యాయి. అల్లు అర్జున్ మరియు సుకుమార్ ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీ అయ్యారు. మరో మూడు వారాల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సినిమా ప్రమోషన్ ను నిర్వహించేందుకు గానూ అల్లు అర్జున్ ఇతర యూనిట్ సభ్యులు ముంబై సహా పలు ముఖ్యమైన నగరాలకు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. పుష్ప రెండు పార్ట్‌ లుగా గా రాబోతున్న విషయం తెల్సిందే.

మొదటి పార్ట్ ను వచ్చే నెలలో ప్రేక్షకుల చూడబోతున్నారు. తదుపరి పార్ట్‌ కు సంబంధించిన అప్డేట్ త్వరలో వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సమయంలో అల్లు వారి కాంపౌండ్ నుంచి ఒక ఇంట్రెస్టింగ్ సమాచారం అందుతోంది. అది ఏంటి అంటే అల్లు అర్జున్ అతి త్వరలో ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేయబోతున్నాడట. పుష్ప సినిమా గురించి కాకుండా పుష్ప రాజ్ చేయబోతున్న ఆ స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ ఏంటా అంటా అంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ అనౌన్స్మెంట్ కచ్చితంగా అభిమానులను సర్ప్రైజ్ చేస్తుందని అల్లు వర్గాల వారు అంటున్నారు. ఇంతకు ఆ సర్ప్రైజింగ్ ప్రకటన ఏంటా అంటూ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాకు సంబంధించిన ప్రకటన అయి ఉంటుందా.. లేదంటే ఆయన ప్రత్యేకంగా ఏదైనా ఈ విషయం గురించి ప్రకటించబోతున్నట్లు అంటూ అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.

ఇదే సమయంలో అల్లు అర్జున్ ఓటీటీ ఎంట్రీ కి సంబంధించిన విషయం ను ప్రకటిస్తే బాగుంటుందనే అభిప్రాయంను అభిమానులు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా అల్లు అర్జున్ నుంచి వచ్చే ప్రకటన కచ్చితంగా అభిమానులను సర్ప్రైజ్ చేయడం మాత్రమే కాకుండా వారందరికీ కూడా కచ్చితంగా సంతోషాన్ని కలిగిస్తుందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు. అల్లు అర్జున్ నుండి రాబోతున్న ఆ ప్రకటన ఏంటి ఎలా ఉండబోతోంది అనే విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం పుష్ప సినిమా సోషల్ మీడియా లో ట్రెండ్ లో ఉంది. రష్మిక మరియు అల్లు అర్జున్ రొమాన్స్ కోసం అభిమానులు మరియు ప్రేక్షకులు ఎదురు చూస్తున్నామని కామెంట్ చేస్తున్నారు. ఇక మలయాళం స్టార్‌ హీరో ఫాహద్ ఫాజిల్ మరియు టాలీవుడ్ కామెడీ స్టార్ సునీల్ ఇంకా జబర్దస్త్ యాంకర్ అనసూయ లు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు విపరీతమైన బజ్ ఉంది. బన్నీ మాస్ లుక్ తో పాటు రష్మిక హాట్ క్యూటీ పల్లెటూరి అందాలు సినిమా స్థాయిని పెంచుతున్నాయి అనడంలో సందేహం లేదు.