Begin typing your search above and press return to search.

సామ్ వెన‌క పుష్ప రాజ్ కుట్ర అంతుందా?

By:  Tupaki Desk   |   23 Nov 2021 5:37 AM GMT
సామ్ వెన‌క పుష్ప రాజ్ కుట్ర అంతుందా?
X
ఇటీవ‌లి కాలంలో కాస్టింగ్ ఎంపిక‌లు మొద‌లు స్పెష‌ల్ నంబ‌ర్ వ‌ర‌కూ ప్ర‌తిదీ సినిమా మైలేజ్ పెంచేందుకు ఉప‌క‌రించేవిగా క‌నిపిస్తున్నాయి. పాన్ ఇండియా స్ట్రాట‌జీని అనుస‌రించి బిజినెస్ చేయాల‌న్నా.. ప్రేక్ష‌కుల‌లో క్రేజును పెంచాల‌న్నా.. స‌రికొత్త ఎత్తుగ‌డ‌ల్ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు అనుస‌రించాల్సిన ప‌రిస్థితి ఉంది. ఫ‌లానా స్టార్ ని ఎంపిక చేసుకుంటే పొరుగున త‌మ‌కు మార్కెట్ పెరుగుతుంద‌ని ఆశించే ఎత్తుగ‌డ ఇప్పుడు ఉంది. ఏదైనా ఐట‌మ్ నంబ‌ర్ ప్లాన్ చేసినా ఐట‌మ్ గాళ్ వ‌ల్ల కూడా మార్కెట్ రేంజు పెంచుకునే ఎత్తుగ‌డ‌ను అనుస‌రిస్తున్నారు.

ఇప్పుడు `పుష్ప - ది రైజ్` టీమ్ కూడా ఇదే తీరుగా ఆలోచిస్తోంద‌ని అర్థ‌మ‌వుతోంది. పుష్ప చిత్రంతో బ‌న్ని హిందీ ప‌రిశ్ర‌మ‌లోనూ త‌న మార్కెట్ రేంజును విస్త‌రించాల‌ని క‌సిగా ఉన్నాడు. అందుకు త‌గ్గ‌ట్టే కాస్టింగ్ ఎంపిక‌లు స‌హా ప్ర‌తిదీ సాగాయి. ఇక అనూహ్యంగా నోరా ఫ‌తేహి స్థానంలో స‌మంత‌ను ప్ర‌త్యేక గీతంలో న‌ర్తింప‌జేయ‌డం వెన‌క బిజినెస్ స్టాటిస్టిక్స్ బ‌లంగానే ఉన్నాయ‌న‌డంలో ఎలాంటి సందేహం లేదు. ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించేందుకు స‌మంత‌కు ఒక సినిమాకి ఇచ్చినంత పారితోషికం (సుమారు 2కోట్లు) ఇస్తున్నారంటేనే అర్థం చేసుకోవ‌చ్చు.

అయితే ఇదంతా దేనికి? అంటే ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో అత్యుత్త‌మ న‌ట‌న‌తో అటు హిందీ ప‌రిశ్ర‌మ స‌హా ప్రేక్ష‌కుల్లోనూ గొప్ప ఫాలోయింగ్ ని సంపాదించ‌డంలో స‌మంత స‌ఫ‌ల‌మైంది. ప్ర‌స్తుతం త‌న‌కు పాన్ ఇండియా అప్పీల్ ఉంది. హిందీ ప‌రిశ్ర‌మ‌లో న‌టింప‌జేసేందుకు కూడా ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు సీరియ‌స్ గా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే ఇది పుష్ప‌రాజ్ టీమ్ కి క‌లిసి రానుంది. స‌మంత‌కు అమాంతం పెరిగిన పాన్ ఇండియా క్రేజ్ `పుష్ప` చిత్రానికి అద‌న‌పు బ‌లం కానుంది. అటు హిందీ ప్ర‌మోష‌న్స్ లోనూ స‌మంత‌ను ముందుకు తోసి ప్ర‌చారం చేసుకుంటే అది క‌లిసొస్తుంద‌న్న ఎత్తుగ‌డ కూడా ఉంది. మొత్తానికి సామ్ కి రెండు కోట్ల పారితోషికం ఇస్తున్నారంటే ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించడంతో పాటు ప్ర‌చారానికి స‌హ‌క‌రిస్తుంద‌నే. `ఫ్యామిలీమ్యాన్ 2`లో రాజీ అనే తీవ్రవాది పాత్ర‌లో స‌మంత న‌టించింది. త‌న న‌ట‌న‌కు అన్ని భాష‌ల్లో మంచి పేరొచ్చింది. జాతీయ స్థాయి గుర్తింపు ద‌క్కింది.

అందుకే సమంతా స్పెష‌ల్ సాంగ్ సినిమా పాన్-ఇండియా బాక్సాఫీస్ అవకాశాలను పెంచాల్సి ఉంటుంది. ఈనెల 28 నుంచి ప్రత్యేక సెట్ లో డ్యాన్స్ ను చిత్రీకరించనున్నారు. ఇందులో సమంత- అల్లు అర్జున్ లు పాల్గొంటారు. `పుష్ప: ది రైజ్` డిసెంబర్ 17న విడుదల కానుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల్ని న‌మోదు చేస్తుంద‌న్న అంచ‌నాలున్నాయి.