Begin typing your search above and press return to search.

‘పుష్ప’ను ఆరు నెలల్లో చుట్టేయనున్నారట!

By:  Tupaki Desk   |   27 July 2020 11:15 AM IST
‘పుష్ప’ను ఆరు నెలల్లో చుట్టేయనున్నారట!
X
అల్లు అర్జున్‌ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న పుష్ప చిత్రం చర్చలు ప్రారంభం అయ్యి ఏడాదికి పైగానే అయ్యింది. అల వైకుంఠపురంలో సినిమా షూటింగ్‌ లో ఉండగానే దీనిని మొదలు పెట్టాలనుకున్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా వేశారు. గత ఏడాది డిసెంబర్‌ నుండి పుష్ప చిత్రంను మొదలు పెట్టాలని తీవ్రంగా ప్రయత్నాలు జరిగాయి. అల వైకుంఠపురంలో చిత్రం విడుదల అయిన తర్వాత పుష్ప ను పట్టాలెక్కించాలుకున్నారు. అలా అలా ఆలస్యం అవుతూ వచ్చిన సినిమా కరోనా కారణంగా మరో నాలుగు నెలలుగా వాయిదా పడుతూనే ఉంది.

సాదారణంగా సుకుమార్‌ తన సినిమాల చిత్రీకరణకు కాస్త ఎక్కువ టైం తీసుకుంటాడు. కాని పుష్ప చిత్రాన్ని మాత్రం కేవలం ఆరు నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడట. సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ అంతా కూడా పూర్తి అయ్యింది. ఇప్పటికే చాలా ఆలస్యం అయిన కారణంగా షూటింగ్‌ ను సాగదీయకుండా బ్రేక్‌ లేకుండా చకచకా పూర్తి చేయాలని సుకుమార్‌ భావిస్తున్నాడట. అల్లు అర్జున్‌ కూడా అదే ఉద్దేశ్యంతో ఉండటం వల్ల పుష్ప పాత్ర కోసం ముందస్తుగా చాలా కసరత్తు చేస్తున్నాడు.

డైలాగ్స్‌ మరియు పాత్రకు సంబంధించిన విషయాలను ముందుగానే ట్రైనింగ్‌ అవ్వడం వంటివి చేస్తున్నాడు. షూటింగ్‌ కు వెళ్లిన సమయంలో ఏమాత్రం ఇబ్బంది లేకుండా బ్రేక్‌ లేకుండా షూటింగ్‌ జరిగేలా ప్లాన్‌ చేస్తున్నారు. అక్టోబర్‌ లేదా నవంబర్‌ లో సినిమాను పూర్తి చేసి సమ్మర్‌ వరకు లేదా జూన్‌ జులై లో అయినా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నారట.