Begin typing your search above and press return to search.

పుష్పకు ట్రిపుల్ ఆర్ దెబ్బ మరోలా... ?

By:  Tupaki Desk   |   7 Jan 2022 8:00 PM IST
పుష్పకు ట్రిపుల్ ఆర్ దెబ్బ మరోలా... ?
X
పుష్ప మూవీ రిలీజ్ అయి మూడవ వారంలో కూడా సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. నార్త్ ఇండియాలో ఈ మూవీ ఏకంగా డెబ్బై కోట్ల షేర్ కలెక్ట్ చేసి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలను నోరెళ్ళబెట్టేలా చేసింది. ఇక సౌతిండియాలో కోలీవుడ్ మాలీవుడ్ లల్లో బన్నీ దూకుడు మామూలుగా లేదు.

రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా కలెక్షన్లు ఎక్కడా డ్రాప్ అవడంలేదు. మామూలు రోజుల్లో అయితే పుష్ప మూవీకి రోజుకు రెండు నుంచి నాలుగు కోట్లు వస్తూంటే వీకెండ్స్ లో నాలుగు నుంచి ఆరు కోట్ల దాకా వసూల్ చేస్తోంది. సరిగ్గా ఈ టైమ్ లో పుష్ప ఓటీటీ మూవీ స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది.

హిందీ తప్పించి మిగిలిన భాషల్లో ఓటీటీ రైట్స్ అమెజాన్ కి ఇచ్చేశారు. జనవరి 7 నుంచి స్ట్రీమింగ్ అయ్యేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందం జరిగిన నాటికి పరిస్థితులు వేరు. జనవరి 7న ట్రిపుల్ ఆర్ రిలీజ్ ఉంది. దాంతో ఎంత కలెక్షన్లు కొల్లగొట్టినా మూడు వారాలే కదా అని పుష్ప మేకర్స్ అమెజాన్ కి కరెక్ట్ గా ఏడవ తేదీ నుంచి స్ట్రీమింగ్ రైట్స్ ఇచ్చేశారు.

ఇపుడు అనూహ్యంగా ట్రిపుల్ ఆర్ వాయిదా పడింది. దాంతో పాటు సంక్రాంతికి రావాల్సిన పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక పక్కా మాస్ మసాలా చిత్రంగా పుష్ప ఉండబోతోంది. అయితే ఓటీటీకి బొమ్మ ఇచ్చేయడంతో పుష్పకు అదే పెద్ద దెబ్బగా మారిపోతోంది. దీంతో ఓటీటీ ద్వారా ఈజీగా బెస్ట్ కాపీని పైరసీ చేసి మరీ జనాలు చూసేస్తారు. దాంతో సంక్రాంతికి థియేటర్లకు వచ్చే జనాలకు పుష్ప ఆప్షన్ గా ఉండదు అంటున్నారు.

ఇపుడున్న ఊపులో కనుక చూస్తే ఓటీటీ ఊసే లేకపోతే ఈ సంక్రాంతికి పుష్ప ఇంకా గొప్ప కలెక్షన్లతో ఇరగదీసేదని అంటున్నారు. మొత్తానికి ట్రిపుల్ ఆర్ మూవీ ఆ విధంగా కూడా పుష్పను దెబ్బేసింది అంటున్నారు. మొత్తానికి పుష్ప కంటే ముందే రిలీజ్ అయిన అఖండ మాత్రం జనవరి 21న వరకూ ఓటీటీలో స్ట్రీమింగ్ రాకుండా చూసుకుంటోంది. దాంతో అఖండకు ఉన్నంతలో కలెక్షన్లు నిలిచే చాన్స్ ఉంది. అప్పటిదాకా థియేటరల్లో తమ బొమ్మ ఉంచేలా అఖండ మేకర్స్ చూస్తున్నారు.