Begin typing your search above and press return to search.

'పుష్ప' లేటెస్ట్ అప్డేట్..!

By:  Tupaki Desk   |   14 May 2021 6:30 AM GMT
పుష్ప లేటెస్ట్ అప్డేట్..!
X
అల్లు అర్జున్ - డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా మూవీ ''పుష్ప''. ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌ గా బన్నీ కనిపించనున్నాడు. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. కోవిడ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది.

తాజా సమాచారం ప్రకారం, 'పుష్ప' సినిమాని ఇప్పటివరకు 110 రోజుల పాటు చిత్రీకరించారు. అందులో పార్ట్-1కు సంబంధించిన షూటింగ్ 80 శాతం.. రెండో భాగంలో 10 శాతం షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. ఫస్ట్ పార్ట్ లో ఒక ఐటమ్ సాంగ్ మరియు కొన్ని సన్నివేశాల చిత్రీకరణ మాత్రమే పెండింగ్ ఉంది. 25 రోజుల పాటు షెడ్యూల్ తో మొదటి భాగం షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని తెలుస్తోంది. ఇందులో బన్నీ - ఫహద్ ఫాసిల్ పాల్గొనే కీలక సన్నివేశాలను షూట్ చేయాల్సి ఉంది. కరోనా పరిస్థితులు అనుకూలిస్తే చిత్రీకరణ తిరిగి ప్రారంభించాలని మేకర్స్ భావిస్తున్నారు. 'పుష్ప-1' పూర్తైన వెంటనే పార్ట్2 షూట్ స్టార్ట్ చేయనున్నారు.

'పుష్ప' మొదటి భాగాన్ని ఈ ఏడాదిలో సెకండ్ పార్ట్ 2022లో విడుదల చేయనున్నారు. సౌత్ లో 'బాహుబలి' 'కేజీఎఫ్' వంటి సినిమాల తర్వాత రెండు భాగాలుగా వచ్చే సినిమా 'పుష్ప' అని చెప్పవచ్చు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఆస్కార్ గ్రహీత రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ - ముత్యంశెట్టి మీడియా సంస్థలు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.