Begin typing your search above and press return to search.

పుష్ప రాజ్ ద‌గ్గ‌రికే హిందీ రైట్స్ పంచాయితీ

By:  Tupaki Desk   |   7 Nov 2021 4:00 PM IST
పుష్ప రాజ్ ద‌గ్గ‌రికే హిందీ రైట్స్ పంచాయితీ
X
2021 మోస్ట్ అవైటెడ్ జాబితాలో #పుష్ప పేరు మార్మోగుతున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు-త‌మిళం-హిందీతో పాటు పాన్ ఇండియా కేట‌గిరీలో వివిధ భాష‌ల్లోకి అనువాద‌మై అత్యంత భారీగా ఈ చిత్రం విడుద‌ల కానుంది. అన్ని భాష‌ల్లోనూ పుష్ప బిజినెస్ జోరుగానే సాగుతోంది. ఇప్ప‌టికే రిలీజైన టీజ‌ర్ ల‌కు పోస్ట‌ర్ల‌కు చ‌క్క‌ని స్పంద‌న వ‌చ్చింది. అయితే తెలుగు-త‌మిళ మార్కెట్ల‌లో ఓకే కానీ హిందీ మార్కెట్లోనే తాజా పంచాయితీ పుష్ప‌రాజ్ కి షాకిస్తోంద‌నేది గుస‌గుస‌.

బ‌న్ని మార్కెట్ విష‌యం ప‌క్క‌న పెడితే ఇప్పుడు పుష్ప హిందీ రైట్స్ కొనుకున్న వాళ్లు ఏకంగా ఈ సినిమాను హిందీలో థియేట‌ర్ రిలీజ్ చేయ‌డానికి వీల్లేదు అంటున్నారట‌. దీంతో ఖంగుతున్న మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ‌ ఈ పంచాయితీని తీర్చాల్సిందిగా అల్లు అర‌వింద్ ని, బ‌న్నీని కోరిన‌ట్లుగా స‌మాచారం. పంపిణీదారుడితో గొడ‌వ‌ను చ‌ల్లార్చే బాధ్య‌త‌ను ఇప్పుడు ఆ ఇద్ద‌రూ తీసుకున్నార‌ట‌. చివ‌ర‌కు పుష్ప రాజ్ ద‌గ్గ‌ర‌కే పుష్ప హిందీ రైట్స్ పంచాయితీ రావ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది.

పుష్ప కోసం ఇప్ప‌టి వ‌ర‌కు మైత్రి సంస్థ‌ దాదాపుగా 195 కోట్లు ఖర్చు చేసింది. సుకుమార్ - బ‌న్నీ కెరీర్ లో బిగ్గెస్ట్ బ‌డ్జెట్ సినిమాగా రికార్డుల‌కెక్క‌నుంది. ఆర్య‌-ఆర్య 2 త‌ర్వాత హ్యాట్రిక్ మూవీగా వ‌స్తోంది కాబ‌ట్టి ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెలకొన్నాయి. బ‌న్ని మాస్ యాక్ష‌న్ అవ‌తార్ కి చక్క‌ని స్పంద‌న వ‌స్తోంది. క్రిస్మ‌స్ కానుక‌గా ఈ చిత్రం డిసెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతోంది. అయితే హిందీ రిలీజ్ ఎంతో కీల‌కం కానుంది కాబ‌ట్టి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించుకునే దిశ‌గా బ‌న్ని ప్లాన్ చేస్తున్నార‌ని టాక్ వినిపిస్తోంది.