Begin typing your search above and press return to search.
'పుష్ప' ఫస్ట్ డే హౌస్ ఫుల్.. అడ్వాన్స్ బుకింగ్స్ లో 'తగ్గేదే లే'..!
By: Tupaki Desk | 16 Dec 2021 7:57 PM ISTపాన్ ఇండియా స్థాయిలో రూపొందిన 'పుష్ప: ది రైజ్' విడుదలకు సర్వం సిద్ధం అయింది. తెలుగు తమిళం మలయాళం కన్నడ హిందీ వంటి ఐదు భాషల్లో ముందుగా ప్లాన్ చేసిన ప్రకారమే రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ లో పుష్పరాజ్ హవా చూపిస్తున్నాడు. బుకింగ్స్ ఓపెన్ చేసిన ప్రతి చోటా నిమిషాల్లోనే 'హౌస్ ఫుల్' బోర్డ్స్ పడిపోతున్నాయి. చాలా థియేటర్లలో ఫస్ట్ డే షోలు అన్నీ దాదాపుగా అమ్ముడుపోయాయి.
యూఎస్ఏలో ప్రీ సేల్స్ లో 'పుష్ప' పార్ట్-1 ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది. 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' కారణంగా ఎక్కువ స్క్రీన్స్ దొరక్కపోయినా అడ్వాన్స్ బుకింగ్స్ లో బన్నీ సినిమా సత్తా చాటింది. తెలంగాణాలో ఈ చిత్రానికి ఫస్ట్ డే రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. బిగ్గెస్ట్ మాస్ పార్టీ కోసం 'తగ్గేదేలే' అంటూ అల్లు అర్జున్ అభిమానులు టిక్కెట్స్ బుక్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో తొలి రోజు షోలు అన్నీ అమ్ముడుపోయాయి.
'పుష్ప' సినిమా కోసం కొన్ని టిక్కెట్లు రిజర్వ్ చేయమని ప్రముఖుల నుండి థియేటర్ యజమానులకు ఒత్తిళ్లు వస్తున్నాయంటేనే థియేటర్ల వద్ద పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అడ్వాన్స్ బుకింగ్ తోనే టికెట్స్ అన్నీ అమ్ముడుపోవడంతో ఎగ్జిబిటర్లు కూడా ఏం చేయలేకున్నారు. కొందరు థియేటర్ల ఓనర్లు.. మల్టీప్లెక్స్ ల నిర్వాహకులు తమ ఫోన్లను కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నారని తెలుస్తోంది.
సినీ ప్రముఖులు రిక్వెస్ట్ చేసినా కూడా స్పందించడం లేదంటే ఫస్ట్ డే ఫస్ట్ షో 'పుష్ప' సినిమా డిమాండ్ ఎలా ఉందో అర్థం అవుతుంది. కరోనా నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత ఇండస్ట్రీలో అలాంటి పరిస్థితి మళ్ళీ కనిపిస్తోంది. ఇప్పుడు అల్లు అర్జున్ సినిమా చుట్టూ జరుగుతున్న టికెట్ల హడావిడి, టాలీవుడ్ లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. రాబోయే పెద్ద సినిమాలకు కూడా ఇదే తరహా హంగామా ఉండాలని అందరూ కోరుకుంటున్నారు.
ఇకపోతే ఏపీలో 'పుష్ప' సినిమాకు పూర్తి స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ కాలేదు. టికెట్ రేట్ల వ్యవహారంలో నెలకొన్న గందరగోళం కారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో బుకింగ్స్ పెట్టలేదు. కాకపోతే ఓపెన్ అయిన మల్టీప్లెక్స్ ల టికెట్లు మాత్రం హాట్ కేకుల్లా అమ్ముడు పోయాయి. ఏదేమైనా ఫస్ట్ డే బుకింగ్స్ చూస్తుంటే బన్నీ సినిమా బాక్సాఫీస్ వద్ద ఓపెనింగ్స్ లో దుమ్ము దులపనుందని తెలుస్తోంది.
కాగా, అల్లు అర్జున్ - సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హ్యాట్రిక్ మూవీ ''పుష్ప: ది రైజ్''. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. రష్మిక మందన్నా ఇందులో హీరోయిన్. దేవిశ్రీప్రసాద్ సంగీతం సమకూర్చారు.