Begin typing your search above and press return to search.
‘పుష్ప’.. ఇక ఫిక్సయిపోవచ్చా?
By: Tupaki Desk | 22 Dec 2021 9:00 PM IST‘పుష్ప’ సినిమా తొలి వారాంతంలో ఆ ఏరియా, ఈ ఏరియా అని తేడా లేకుండా దేశవ్యాప్తంగా అన్ని చోట్లా వసూళ్ల మోత మోగించింది. తెలుగు రాష్ట్రాల సంగతైతే చెప్పాల్సిన పని లేదు. ఇటు తెలంగాణలో, అటు ఏపీలో వీకెండ్ మొత్తం హౌస్ ఫుల్ కలెక్షన్లతో రన్ అయిందీ సినిమా. కానీ సినిమాకు డివైడ్ టాక్ వచ్చిన నేపథ్యంలో వీకెండ్ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు తగ్గట్లే సోమవారం వసూళ్లు పడ్డాయి. ఆ రోజు కంటే కూడా మంగళవారం కలెక్షన్లలో మరింత డ్రాప్ కనిపించడం ఆందోళన రేకెత్తించేదే.
మూడు రోజుల తొలి వీకెండ్లో రికార్డు స్థాయిలో దాదాపు 26 కోట్ల షేర్ రాబట్టిన నైజాంలో సోమవారం ఈ చిత్రానికి రూ.3.35 కోట్ల షేర్ రావడంతో వీక్ డేస్‌లో కూడా సినిమా బలంగానే నిలబడిందని అనుకున్నారు. కానీ తర్వాతి రోజుకు వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి. మంగళవారం తెలంగాణ మొత్తంలో ‘పుష్ప’కు రూ.1.8 కోట్ల షేరే వచ్చింది. వీకెండ్‌కు మళ్లీ సినిమా పుంజుకోకుండా నైజాంలో స్వల్ప నష్టాలు తప్పేలా లేవు. ఇంకో ఐదు కోట్ల షేర్ రాబడితే తప్ప నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు సేఫ్ జోన్లోకి రాడు.
ఐతే తెలంగాణలో మామూలుగానే టికెట్లు రేట్లు మెరుగ్గా ఉండగా.. ‘పుష్ప’కు 75 శాతం దాకా రేట్లు పెంచుకుని దిల్ రాజు బాగానే సేవ్ అయ్యాడు కానీ.. ఆంధ్రా, సీడెడ్‌లో మాత్రం ‘పుష్ప’ పెద్ద డిజాస్టర్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ చిత్ర ఆంధ్రా హక్కులను దాదాపు 50 కోట్లకు అమ్మారు. సీడెడ్ రైట్స్ రూ.18 కోట్లకు ఇచ్చారు.
తొలి వారాంతంలో ఆంధ్రా ఏరియాలన్నింట్లో కలిపి ఈ చిత్రానికి రూ.18 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. సీడెడ్ ఫస్ట్ వీకెండ్ షేర్ రూ.9 కోట్లు. వీకెండ్ తర్వాత రెండు చోట్లా సినిమా స్లో అయింది. పరిస్థితి చూస్తుంటే ఆంధ్రాలో ఈ చిత్రం రూ.30 కోట్ల షేర్ కూడా రాబట్టేలా లేదు. రాయలసీమ షేర్ రూ.13-14 కోట్ల మార్కును దాటేలా లేదు. కాబట్టి ఈ రెండు ఏరియాల్లో, ముఖ్యంగా ఆంధ్రాలో ‘పుష్ప’ డిజాస్టర్‌గా తేలేలా ఉంది.