Begin typing your search above and press return to search.

పుష్ప హిందీ వెర్స‌న్ 13రోజుల్లో 45కోట్లు

By:  Tupaki Desk   |   30 Dec 2021 3:45 PM IST
పుష్ప హిందీ వెర్స‌న్ 13రోజుల్లో 45కోట్లు
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన `పుష్ప- ది రైజ్` మూడోవారంలోను అద్భుత వ‌సూళ్ల‌ను సాధిస్తోంది. ఇంటా బ‌య‌టా ఈ సినిమా సాధించిన వ‌సూళ్లు హాట్ టాపిక్ గా మారాయి. పుష్ప-ది రైజ్ గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద రూ. 300 కోట్లు వసూలు చేస్తుందని నిర్మాతలు అంచనా వేస్తున్నారు. పుష్ప హిందీ బాక్సాఫీస్ వద్ద అద్భుతంగా రన్ అవుతోంది.

ఈ చిత్రం మంగళవారం 20 శాతం మైనర్ డిప్ ను నమోదు చేసినా కానీ ముంబై సర్క్యూట్ లో మంచి ప్రదర్శనను కొనసాగిస్తోంది. రూ. 2.50 కోట్ల నెట్ తో.. పుష్ప (హిందీ) మొత్తం వసూళ్లు రూ. 45.50 కోట్ల నికర విలువ‌ను న‌మోదు చేశాయి. దీనికి సంబంధించి చిత్ర‌బృందం అధికారికంగా వ‌సూళ్ల ఫిగ‌ర్ ని ముద్రించి పోస్ట‌ర్ ని విడుద‌ల చేసింది. పుష్ప హిందీ వెర్ష‌న్ 13 రోజుల్లో 45.5 కోట్ల‌ను వ‌సూలు చేసింద‌ని వెల్ల‌డించింది.

అయితే అనూహ్యంగా ఒమిక్రాన్ పుష్ప‌కు పంచ్ ఇస్తోంది. దిల్లీలో సినిమా థియేటర్లు మూతపడడంతో ‘పుష్ప’ హిందీ కలెక్షన్లపై ప్రభావం పడనుంద‌ని భావిస్తున్నారు. అయితే ‘పుష్ప’ హిందీకి మహారాష్ట్ర- గుజరాత్ ల నుంచి అత్యధికంగా 60 శాతం వ‌సూళ్ల దందా సాగింది. రెండవ వారంలో పుష్ప హిందీ మొద‌టి వారం కలెక్షన్ కు దాదాపు 20 కోట్లను జోడించవచ్చని అంచనా. మొదటి వారం కంటే 25 శాతం డ్రాప్ ను నమోదు చేసినా ఇది మంచి ఫ‌లితం కిందే లెక్క‌.

పుష్ప వాస్తవానికి తెలుగు భాషను దృష్టిలో పెట్టుకుని తెర‌కెక్కించిన‌ యాక్షన్ డ్రామా. ఇది మలయాళం- తమిళం- కన్నడ - హిందీ భాషల్లో విడుదలైంది. అల్లు అర్జున్- రష్మిక మందన్న- ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ ఎంటర్ టైనర్ కి సుకుమార్ రచన -దర్శకత్వం వహించారు.

డిసెంబర్ 17న విడుదలైన ఈ సినిమా సినిమాలోని ఓ రొమాంటిక్ సన్నివేశంపై ఓ వర్గం ప్రేక్షకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ ప్రదేశంలో ప్రేయ‌సి అందాల‌ను తాకే హీరో సీన్ ని ఆ హావభావాలను తొల‌గించాల‌ని డిమాండ్ చేసారు కొంద‌రు జ‌నం. వాన్ సీన్ లేదా టిఫిన్ సీన్ పై వివాదం న‌డిచింది. తరువాత మేకర్స్ వివాదాస్పద సన్నివేశాన్ని తొలగించారు. అయినా పుష్ప కు ఇత‌ర భాష‌ల్లో ఆ ఇబ్బంది లేదు.