Begin typing your search above and press return to search.

నాలుగు భాషల్లోనూ కనిపించి వినిపించబోతున్న పుష్ప

By:  Tupaki Desk   |   14 Nov 2021 8:49 AM IST
నాలుగు భాషల్లోనూ కనిపించి వినిపించబోతున్న పుష్ప
X
అల్లు అర్జున్‌.. సుకుమార్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప సినిమా వచ్చే నెలలో విడుదలకు సిద్దం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. కాని చివరి నిమిషంలో హిందీ వర్షన్ విషయంలో నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా సమాచారం అందుతోంది. సౌత్ లోని నాలుగు భాషల్లో మాత్రమే ఈ సినిమాను విడుదల చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఉత్తరాది అల్లు అర్జున్‌ అభిమానులతో పాటు ఇక్కడి వారు కూడా పుష్ప ను హిందీలో కూడా విడుదల చేయాలనే డిమాండ్ చేస్తున్నారు. కాని అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. తెలుగు తో పాటు తమిళం.. కన్నడం మరియు మలయాళంలో ఈ సినిమాను విడుదల చేయడం మాత్రం పక్కా అని తేలిపోయింది. ఈ నాలుగు భాషల్లో పుష్ప పాత్రకు గాను అల్లు అర్జున్‌ డబ్బింగ్ చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.

రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ ఆర్‌ ఆర్‌ సినిమా లో హీరోలు ఇతర భాషల్లో డబ్బింగ్‌ చెప్పబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు అదే దారిలో పుష్ప సినిమాకు కూడా ఇతర మూడు భాషల్లో కూడా బన్నీ డబ్బింగ్ చెప్పేందుకు గాను ఇప్పటి నుండే కసరత్తు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. తమిళం మరియు మలయాళం ఇప్పటికే బన్నీకి వస్తాయి. కన్నడ భాష కూడా తెలుగు కు దగ్గరగా ఉంటుంది కనుక డబ్బింగ్ చెప్పడం కష్టం కాకపోవచ్చు. ఎవరి పాత్రకు వారు డబ్బింగ్ చెప్తే ప్రాణం పోసినట్లుగా ఉంటుంది. అందుకే అల్లు అర్జున్ పుష్ప అన్ని భాషల వర్షన్ లకు తానే డబ్బింగ్ చెప్తానంటూ స్వయంగా తానే కష్టపడి డబ్బింగ్ చెప్పినట్లుగా చెబుతున్నారు.

పుష్ప కోసం అల్లు అర్జున్ ఇప్పటికే చాలా కష్టపడ్డాడు. గత రెండేళ్లుగా బన్నీ పుష్ప పాత్ర కోసంగా జుట్టు మరియు గడ్డం పెంచుకుని ఉన్నాడు. సుకుమార్ మరియు బన్నీల కాంబోలో గతంలో వచ్చిన సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమాను మరింతగా సక్సెస్ చేయడం కోసం వీరిద్దరు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరి కాంబోలో రాబోతున్న ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలవడంతో పాటు వీరి కాంబోకు హ్యాట్రిక్ ను ఇస్తుందనే నమ్మకం కూడా వ్యక్తం అవుతోంది. పెద్ద ఎత్తున అంచనాలున్న పుష్ప సినిమా లో హీరోయిన్ గా రష్మిక మందన్నా నటిస్తుండా కీలక పాత్రలో సునీల్‌.. అనసూయ మరియు ఫాహద్ ఫాజిల్ లు నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ సినిమా పాటలు ఇప్పటికే శ్రోతలను ఆకట్టుకుంటున్న విషయం తెల్సిందే.