Begin typing your search above and press return to search.

పుష్ప' ఫస్ట్ సాంగ్ తమిళ వెర్షన్ ప్రోమో..!

By:  Tupaki Desk   |   4 Aug 2021 2:21 PM GMT
పుష్ప ఫస్ట్ సాంగ్ తమిళ వెర్షన్ ప్రోమో..!
X
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న యాక్షన్ డ్రామా '' పుష్ప''. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ ని ''పుష్ప: ది రైజ్'' పేరుతో క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్లు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తున్న మేకర్స్.. ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు.

'దాక్కో దాక్కో మేక' అనే సాంగ్ ను ఆగస్ట్ 13న విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందే సినిమా నుంచి వస్తున్న ఈ పాటను తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. తాజాగా తమిళ వెర్సన్ ''ఓడు ఓడు ఆడు'' ప్రోమో సాంగ్ ని చిత్ర బృందం సోషల్ మీడియా మధ్యమాలలో షేర్ చేసారు. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఈ పాటను బెన్నీ దయాల్ పాడారు. దీనికి లిరిసిస్ట్ వివేక సాహిత్యం అందించారు.

'పుష్ప' ఫస్ట్ సాంగ్ ను 5 భాషల్లో ఐదుగురు సింగర్స్ పాడిన సంగతి తెలిసిందే. హిందీలో విశాల్ దడ్లానీ.. కన్నడలో విజయ్ ప్రకాశ్.. మలయాళంలో రాహుల్ నంబియార్.. తెలుగులో శివమ్ ఈ పాటను ఆలపించారు. కాగా, 'పుష్ప' చిత్రంలో లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ లో 'తగ్గేదే లే' అంటూ మాస్ లుక్ లో బన్నీ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడుగా నటిస్తున్నారు.

'పుష్ప' చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై రవిశంకర్ కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముత్యంశెట్టి మీడియా వారు నిర్మాణ బాగస్వాములుగా ఉన్నారు. మిరోస్లా కుబా బ్రోజెక్ ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ఆంటోనీ రూబెన్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. రసూల్ పూకుట్టి సౌండ్ డిజైనింగ్ చేస్తున్నారు.