Begin typing your search above and press return to search.

పుష్ప‌.. పుష్ప‌రాజ్ త‌గ్గేదేలే అంటున్న క్రికెట‌ర్‌

By:  Tupaki Desk   |   23 Dec 2021 1:37 PM GMT
పుష్ప‌.. పుష్ప‌రాజ్ త‌గ్గేదేలే అంటున్న క్రికెట‌ర్‌
X
అల్లు అర్జున్ హీరోగా న‌టించిన పాన్ ఇండియా మూవీ `పుష్ప‌`. సుకుమార్ - బ‌న్నీల కాంబినేష‌న్‌లో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన మూడ‌వ చిత్ర‌మిది. తెలుగుతో పాటు మొత్తం ఐదు భాష‌ల్లో విడుద‌లైన ఈ చిత్రం వ‌ర‌ల్డ్ వైడ్ గా సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. వ‌సూళ్ల ప‌రంగా బాక్సాఫీస్ ని షేక్ చేస్తూ ఆర‌వ రోజు కూడా అదే జోరుని కొన‌సాగిస్తోంది. ఆర‌వ రోజు కూడా ఈ మూవీ 3. 36 కోట్లు షేర్‌ని రాబ‌ట్ట‌డం విశేషం. తొలి రోజే రికార్డు స్థాయి ఓపెనింగ్స్ ని రాబ‌ట్టిన ఈ చిత్రం రిలీజ్ డే రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా 71 కోట్ల వ‌సూళ్ల‌ని సాధించి స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది.

ఈ నేన‌థ్యంలో `పుష్ప‌` మేనియా యావ‌త్ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తోంది. ఈ సంద‌ర్భంగా భార‌త క్రికెట‌ర్ షేర్ చేసిన ఓ వీడియో నెట్టింట వైర‌ల్ గా మారింది. క్రేజీ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా `పుష్ప‌` చిత్రంలో బ‌న్నీ చెప్పిన డైలాగ్ ని అనుక‌రిస్తూ షేర్ చేసి ఈ వీడియో ప్ర‌స్తుతం నెట్టింట వైర‌ల్ గా మారింది. `పుష్ప‌.. పుష్ప‌రాజ్.. నీ య‌వ్వ త‌గ్గేదేలే.. `అనే డైలాగ్ ని అదే స్థాయిలో అనుక‌రిస్తూ స్టార్ క్రికెట‌ర్ ర‌వీంద్ర జ‌డేజా తాజాగా ఓ వీడియోని షేర్ చేయ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

క్రికెట‌ర్ల‌లో బ‌న్నీ సినిమాల‌కున్న క్రేజ్ ని ఈ వీడియో మ‌రో సారి నిరూపించింది. గ‌తంలో బ‌న్నీ న‌టించిన `అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలోని `బుట్ట‌బొమ్మ .. పాట‌ని అనుక‌రిస్తూ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్ త‌న వైఫ్ తో క‌లిసి ఓ వీడియోని షేర్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ వీడియో నెట్టింట ఓ రేంజ్ లో వైర‌ల్ అయింది. ఒక తెలుగు సినిమా పాట‌కు ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ త‌న వైఫ్‌తో క‌లిసి డ్యాన్స్ చేయ‌డం అప్ప‌ట్లో హాట్ టాపిక్ గా మారింది.

తాజాగా బ‌న్నీ న‌టించిన `పుష్ప‌` చిత్రంలోని పాపుల‌ర్ డైలాగ్ ని మ‌న ఇండియ‌న్ క్రికెట‌ర్ అనుక‌రిస్తూ వీడియో చేయ‌డం హాట్ టాపిక్ గా మారింది. తెలుగు సినిమాకు పెరుగుతున్న క్రేజ్ కిదే నిద‌ర్శ‌న‌మ‌ని ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు ఆనందాన్ని వ్య‌క్తం చేస్తున్నాయి. అంతే కాకుండా ఈ క్రేజ్ కి ప్ర‌ధాన కార‌ణం ఉత్త‌రాదిలో `పుష్ప‌` ఓ రేంజ్‌లో వ‌సూళ్ల‌ని రాబ‌ట్ట‌డ‌మే అంటున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు `పుష్ప‌` అన్ని వెర్ష‌న్ లు క‌లుపుకుని 145.5 కోట్లు రాబ‌ట్టి న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి.