Begin typing your search above and press return to search.
సెట్స్ లో అడుగుపెడుతున్న 'పుష్ప'..!
By: Tupaki Desk | 9 Nov 2020 12:45 PM ISTస్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న హ్యాట్రిక్ మూవీ ''పుష్ప''. కరోనా లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా రెగ్యులర్ షూట్ ఇప్పటి వరకు స్టార్ట్ కాలేదు. అయితే గత ఎనిమిది నెలలుగా నిలిచిపోయిన షూటింగ్స్ అన్నీ ఈ మధ్య తిరిగి ప్రారంభిస్తున్న నేపథ్యంలో 'పుష్ప' చిత్రాన్ని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లడానికి మేకర్స్ సన్నాహకాలు చేశారు. రేపటి(నవంబర్ 10) నుంచి ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభిస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ట్విట్టర్ వేదికగా ఓ వీడియో రిలీజ్ చేస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో డైరెక్టర్ సుకుమార్ - హీరో బన్నీ మరియు యూనిట్ సభ్యులు షూట్ గురించి డిస్కషన్ చేసుకుంటూ కనిపిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తగు జాగ్రత్తలతో ఈ సినిమా షూటింగ్ చేయనున్నారు.
కాగా, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రూపొందే ఈ మూవీ ఎక్కువ భాగం షూటింగ్ అడవుల్లో జరుపుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో 'పుష్ప' షూటింగ్ జరగనుందని సమాచారం. ఇక ఈ సినిమాలో బన్నీకి జోడీగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో బన్నీ చిత్తూరు యాసలో మాట్లాడే మొరటు లారీ డ్రైవర్ 'పుష్ప రాజ్' పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన 'పుష్ప' ఫస్ట్ లుక్ లో అల్లు అర్జున్ ఎలా ఉండబోతున్నారో శాంపిల్ గా చూపించారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా బ్యానర్స్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
వీడియో కోసం క్లిక్ చేయండి