Begin typing your search above and press return to search.

పుష్ప డైలాగ్ లెజెండ‌రీ అమితాబ్ నోట‌

By:  Tupaki Desk   |   25 April 2022 4:06 AM GMT
పుష్ప డైలాగ్ లెజెండ‌రీ అమితాబ్ నోట‌
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వ‌చ్చిన `పుష్ప‌- 1` గ్రాండ్ స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా కేట‌గిరీలో ఈ చిత్రం సంచ‌ల‌న విజయం సాధించ‌డ‌మే గాక హిందీ బెల్ట్ లో 100 కోట్ల క్ల‌బ్ సాధించింది. ఇంత‌టి విజ‌యాన్ని పుష్ప టీమ్ సైతం ఊహించ‌లేదు. దీనికి తోడు పుష్ప చిత్రంలో పాట‌లు డైలాగులు నెటిజ‌నుల్లో ఎంతో పాపుల‌ర‌య్యాయి. సెల‌బ్రిటీలు సైతం పుష్ప డైలాగులు స్టెప్పుల‌ను అనుక‌రించారంటే అర్థం చేసుకోవాలి.

ఇప్ప‌టికే చాలా మంది పుష్ప డైలాగ్ ని మోతెక్కించారు. ఇక సోష‌ల్ మీడియాలు యాప్ ల‌లో అయితే ఈ డైలాగ్ హంగామా అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఏకంగా ఇండియ‌న్ సినిమాని ఏలిన లెజెండ‌రీ క‌థానాయ‌కుడు బిగ్ బి అమితాబ్ నోట పుష్ప డైలాగ్ వినిపించింది. ఈ డైలాగ్ ఇప్పుడు ఇంట‌ర్నెట్ ని షేక్ చేస్తోంది. పుష్ప అంటే ఫ్ల‌వ‌ర్ అనుకున్నావా? అంటూ హిందీ డైలాగ్ (పుష్ప నామ్ సున్కే ఫ్ల‌వ‌ర్ సంజే క్యా.. మై ఫ్ల‌వ‌ర్ న‌హి ఫైర్.. హిందీ వెర్ష‌న్‌) చెబుతూ బిగ్ బి బోలెడంత హంగామా సృష్టించారు. మ‌ల్లు అర్జున్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ వీడియోని బోలెడంత వైర‌ల్ చేస్తుండ‌డం విశేషం.

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌వ్యాప్తంగా `పుష్ప ది రూల్` గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పుష్ప ది రైజ్ సినిమా విడుదలై నాలుగు నెలలు దాటినా క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పుడు ఈ ఫీవర్ బాలీవుడ్ సూపర్ స్టార్..బి బిగ్ బి అమితాబ్ బచ్చన్ హోస్టింగ్ చేస్తున్న `కౌన్ బనేగా కరోడ్ పతి` కొత్త సీజ‌న్ కార్యక్రమానికి కూడా తాకింది. ``పుష్ప అంటే పువ్వు అనుకున్నావా.. నిప్పు`` అంటూ హిందీ అమితాబ్ డైలాగ్ చెప్పడమే కాదు.. ప్రేక్షకుల క్విజ్ ప్రశ్నలో పుష్ప సినిమాకు సంబంధించిన ప్రశ్న కూడా వేసారు. ఎర్రచందనం చెట్లు ఏ ప్రాంతానికి చెందుతాయి? అనేది ఈ ప్ర‌శ్న‌.

అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్ పుష్ప - ఫ్ల‌వ‌ర్ డైలాగ్ చెప్పడంతో అది వైరల్ గా మారింది. ఓ అభిమాని ఈ వీడియోను షేర్ చేయగా,.. దేవిశ్రీ ప్రసాద్ లైక్ చేశాడు. జూలై తర్వాత `పుష్ప ది రూల్` షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రం `పుష్ప ది రైజ్` కి సీక్వెల్‌. రష్మిక మందన్న కథానాయిక. వచ్చే ఏడాది వేసవిలో సినిమాను విడుదల చేయాలనేది మేకర్స్ ఆలోచన అని టాక్.

ఊహించ‌నంత బిగ్ స్కేల్ లో

KGF- చాప్టర్ 2 గ్రాండ్ సక్సెస్ తర్వాత ఇక ఏ సినిమా తీసినా ఆ రేంజులోనే ఉండాల‌న్న క‌సి టాలీవుడ్ లో పెరిగింది. ద‌ర్శ‌క‌నిర్మాత‌ల్లో ఇది ఛాలెంజ్ గా మారింది. త‌గ్గేదేలే! అంటూ బ‌న్నీ - సుక్కూ టీమ్ కూడా ఇప్పుడు మ‌రో లెవ‌ల్ ప్లానింగ్ చేస్తున్నారు. విజువల్ అప్ స్కేలింగ్ కోసం పుష్ప 2 స్క్రిప్ట్ ను రివైజ్ చేయాలనుకుంటున్నారని తెలిసింది. కెజిఎఫ్ సీక్వెల్ రికార్డ్ బద్దలు కొట్టిన తర్వాత అమాంతం మారిన స‌న్నివేశ‌మిది. `పుష్ప: ది రైజ్‌`కి సీక్వెల్ ట్రాక్ లో ఆగిపోయింది. కొన‌సాగింపు ప్ర‌య‌త్నాలు సాగ‌డం లేదు ఇప్ప‌టికి. పుష్ప 2 మొదటి భాగం కంటే చాలా పెద్ద స్థాయిలో ప్లాన్ చేయాల‌నుకోవ‌డం వ‌ల్ల‌నే ఈ బ్రేక్ అని కూడా చెబుతున్నారు. మొదటి భాగం అంచనాలకు మించి విజయం సాధించడంతో బడ్జెట్ ను పెంచి యాక్షన్‌ సీక్వెన్స్ ని మ‌రో లెవ‌ల్లో మెరుగుపరిచారు. కానీ ఇప్పుడు `KGF - చాప్టర్ 2` సంచ‌ల‌న విజ‌యం సాధించిన అన్ని పాత‌ రికార్డులను బద్దలు కొట్టడంతో సుకుమార్ దీనిని ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. అందుకే పుష్ప 2 స్క్రిప్టు కోసం మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. సూప‌ర్ హీరో త‌ర‌హా క్వాలిటీస్ తో యాక్ష‌న్ ప‌రంగా ట‌చ‌ప్ ఇవ్వాల‌ని కూడా కోరుకుంటున్న‌ట్టు గుస‌గుస వేడెక్కించేస్తోంది.

ప్ర‌స్తుతానికి పుష్ప 2 మరొకమారు `స్క్రిప్ట్ విజువల్ అప్ స్కేలింగ్` కు వెళ్లే క్ర‌మంలో.. హీరో అల్లు అర్జున్ ఇప్పుడు మరొక చిత్రం షూటింగ్ ని ప్రారంభించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అది ఐకాన్ అవుతుందా కాదా? అన్న‌ది బ‌న్నీనే చెప్పాల్సి ఉంది.