Begin typing your search above and press return to search.

నైజాంలో పుష్ప డే 2 కలెక్షన్స్

By:  Tupaki Desk   |   19 Dec 2021 8:50 AM GMT
నైజాంలో పుష్ప డే 2 కలెక్షన్స్
X
అల్లు అర్జున్- రష్మిక మందన్న జంటగా నటించిన పాన్-ఇండియన్ చిత్రం పుష్పకు అన్ని చోట్ల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. హిందీ బెల్ట్ మిన‌హా బాక్సాఫీస్ క‌లెక్ష‌న్స్ బావున్నాయి. ఈ సినిమా భారీ షేర్ ని వసూలు చేసింది. నైజాంలో తొలిరోజు 11.4 కోట్లు.. 2వ రోజు ఈ రూ. 6.5 కోట్ల డీసెంట్ షేర్ సాధించింది. ఇప్పటివరకు ఈ సినిమా టోటల్ షేర్ రూ. కేవలం 2 రోజుల్లో 17.9 కోట్లుగా ఉంది.

ట్రేడ్ పండితులు ఆదివారం భారీ వసూళ్లను అంచనా వేస్తున్నారు. వారాంతం ముగిసే సమయానికి నైజాం నుంచి ఈ చిత్రం 22 కోట్లకు పైగా వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

అమెరికాలోనూ పుష్ప 2వ రోజు కలెక్షన్లు భారీగా ఉన్నాయి. తొలిరోజు మిక్స్ డ్ టాక్ అందుకున్నా కానీ ఈ చిత్రం రెండవ రోజు USAలో 345 కె డాల‌ర్ల భారీ మొత్తాన్ని వసూలు చేసింది. ఇప్పటివరకు ఈ సినిమా 1.3 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు చేసింది. దీంతో ఈ మాస్ ఎంటర్ టైనర్ అమెరికాలో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది.

సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రష్మిక మందన్న- సునీల్- ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో నటించారు. అన‌సూయ కూడా ఓ ఆస‌క్తిక‌ర పాత్ర‌ను పోషించారు.