Begin typing your search above and press return to search.
ఆ సినిమాతో పుష్పకు పోటీ తప్పేలా లేదు
By: Tupaki Desk | 30 Nov 2021 1:07 PM ISTకరోనా సెకండ్ వేవ్ తర్వాత సినిమాల విడుదల జోరందుకుంది. నవంబర్ నుండి పెద్ద ఎత్తున సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతున్నాయి. హాలీవుడ్ సినిమాలు కూడా మెల్ల మెల్లగా బాక్సాఫీస్ ను షేక్ చేసేందుకు గాను ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ ః నో వే హోమ్ విడుదల కు సిద్దం అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 17న విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని వారాల ముందుగానే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతున్న సమయంలో హడావుడి మామూలుగా లేదు. హాలీవుడ్ యాక్షన్ సినిమాలను అభిమానించే వారు ఇండియాలో పెద్ద ఎత్తున ఉన్నారు. వారంతా కూడా ఈ స్పైడర్ మ్యాన్ కోసం ఎదురు చూస్తున్నారు.
హాలీవుడ్ మూవీ స్పైడర్ మ్యాన్ వచ్చే డిసెంబర్ 17వ తారీకున పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కాబోతుంది. దాంతో రెండు సినిమాల మద్య ఖచ్చితంగా క్లాష్ ఉంటుందని అంతా అనుకుంటున్నారు. ఈ సమయంలో అనూహ్యంగా స్పైడర్ మ్యాన్ సినిమాను ఇండియా వరకు డిసెంబర్ 16వ తారీకునే అంటే ఒక రోజు ముందే విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నారు. ఇండియా వ్యాప్తంగా డిసెంబర్ 16వ తారీకున భారీ ఎత్తున స్పైడర్ మ్యాన్ విడుదల ఉండటం వల్ల తర్వాత రోజు వచ్చే పుష్ప సినిమాకు కాస్త రిలాక్స్ దక్కుతుందని అంటున్నారు. ఒక వేళ స్పైడర్ మ్యాన్ కు సూపర్ హిట్ టాక్ దక్కితే పుష్ప కు దెబ్బ పడే అవకాశాలు ఉన్నాయంటూ ఇండియన్ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అల్లు అర్జున్ పుష్ప సినిమా తెలుగు రాష్ట్రాల్లో మరియు మలయాళంలో ఖచ్చితంగా భారీ వసూళ్లను నమోదు చేస్తుంది. ఏ సినిమా పోటీ వచ్చినా ఇక్కడ పెద్దగా పుష్ప పై ప్రభావం చూపించలేదు. కాని ఉత్తరాదిన మాత్రం పుష్ప కు ఖచ్చితంగా చిన్న సినిమాలు కూడా అక్కడ పెద్ద ఎఫెక్ట్ ను కలిగించే అవకాశం ఉంది. అందుకే పుష్ప సినిమా కు ఉత్తరాదిన స్పైడర్ మ్యాన్ సినిమా తో పోటీ తప్పదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సుకుమార్ ఈ సినిమా ను అత్యంత విభిన్నమైన చిత్రంగా రూపొందినట్లుగా ఇప్పటికే విడుదలైన వీడియోలు మరియు పోస్టర్ లను చూస్తుంటే అర్థం అవుతోంది. అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటన విశ్వరూపం చూపించినట్లుగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు పాజిటివ్ టాక్.. హిట్ టాక్ వస్తే స్పైడర్ మ్యాన్ కూడా వెనక్కు తగ్గాల్సిందే అంటూ కొందరు అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.