Begin typing your search above and press return to search.

బన్నీ కెరియర్లోనే భారీ రిలీజ్ గా 'పుష్ప'

By:  Tupaki Desk   |   16 Oct 2021 3:34 PM GMT
బన్నీ కెరియర్లోనే భారీ రిలీజ్ గా పుష్ప
X
అల్లు అర్జున్ తో 'పుష్ప' సినిమాను మొదలుపెడుతూ, ఇప్పటివరకూ బన్నీ చేసిన సినిమాలు ఒక ఎత్తు, 'పుష్ప' సినిమా ఒక ఎత్తు అని సుకుమార్ చెప్పాడు. ఈ సినిమా నుంచి ఫస్టులుక్ వచ్చిన తరువాత అందరూ కూడా నిజమే అనుకున్నారు. ఆ తరువాత ఈ సినిమా నుంచి వస్తున్న పోస్టర్లు .. టీజర్లు .. లిరికల్ వీడియోలు .. ఇవన్నీ కూడా ఈ సినిమాపై అంచలంచెలుగా అంచనాలు పెంచుతూ పోతున్నాయి. ఈ సినిమా తన కెరియర్లోనే ప్రత్యేకమైనదిగా నిలిచిపోతుందనే బన్నీ మాటలోను హండ్రెడ్ పెర్సెంట్ నిజం ఉందనే విషయం అందరికీ అర్థమైపోయింది.

ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగానే చెబుతూ వస్తున్నారు. ఆ స్థాయి కంటెంట్ ను ఒక్కసారిగా చెప్పలేమనే ఉద్దేశంతోనే రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు చెప్పారు. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా మొదటిభాగం ముగింపు దశకి చేరుకుంది. డిసెంబర్ 17వ తేదీన ఈ సినిమాను 5 భాషల్లో విడుదల చేయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ఓవర్సీస్ లోను ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

హంసిని ఎంటర్టైన్మెంట్స్ - క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ సినిమాను, యూఎస్ లో ఐదు భాషల్లో రికార్డు స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు చెబుతున్నారు. ఈ స్థాయిలో విడుదలవుతున్న బన్నీ మొదటి సినిమా ఇదేనని అంటున్నారు. అలాగే కరోనా సెకండ్ వేవ్ తరువాత దక్షిణాది నుంచి భారీ స్థాయిలో విడుదలవుతున్నసినిమా కూడా ఇదేనని చెబుతున్నారు.

ఇంతటి క్రేజ్ ఉన్న సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. 'దాక్కో దాక్కో మేక' రికార్డుస్థాయి వ్యూస్ ను దక్కించుకుంది. ఇక ఇటీవల వదిలిన 'శ్రీవల్లీ' పాట మిస్సైల్ లా దూసుకుపోతోంది. ఎక్కడ చూసినా ఆ పాటనే వినిపిస్తోంది.

అడవి నేపథ్యం .. అక్కడ జరిగే అక్రమాలు .. అందాల నాయిక చేసే అల్లర్లు .. ఆమె ప్రేమను పొందడానికి కథానాయకుడు పడే అగచాట్లతో ఈ కథ నడుస్తుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా నుంచి వస్తున్న ఒక్కో పాట వింటుంటే ఇది ఒక పాటల పందిరిలా .. పాటల పండుగలా అనిపిస్తోంది. ఇప్పటివరకూ వదిలిన అప్ డేట్ల వలన, ఈ కథలో అన్నిరకాల అంశాలు సమపాళ్లలో సర్దేసినట్టుగా అనిపిస్తోంది. ఈ సినిమా సంచలనానికి సరికొత్త అర్థం చెప్పేదిగానే కనిపిస్తోంది. రష్మిక అందాలు చూడటానికి డిసెంబర్ వరకూ వెయిట్ చేయాలంటే కుర్రాళ్లకు కష్టకాలమే పాపం.