Begin typing your search above and press return to search.

'పుష్ప‌' 50 డేస్..వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?

By:  Tupaki Desk   |   4 Feb 2022 9:30 AM GMT
పుష్ప‌ 50 డేస్..వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్ ఎంతో తెలుసా?
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - స్టార్ డైరెక్ట‌ర్ సుకుమార్ ముచ్చ‌ట‌గా మూడ‌వ‌సారి క‌లిసి చేసిన భారీ చిత్రం `పుష్ప ది రైజ్‌`. మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మించారు. గ‌త ఏడాది డిసెంబ‌ర్ 17న విడుద‌లైన ఈ చిత్రం ఊహించ‌ని స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్ గా వ‌సూళ్ల వ‌ర్షం కురిసిస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌తో పాటు మేక‌ర్స్ ని కూడా విస్మ‌యానికి గురిచేస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగ భారీ స్థాయిలో విడుద‌లైన ఈ చిత్రం 2021లో విడుద‌లైన చిత్రాల్లో హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా నిలిచి రికార్డుని సొంతం చేసుకుంది.

మ‌రి ప్ర‌ధానంగా ఉత్త‌రాదిలో ఎలాంటి ప్ర‌చారం లేకుండా విడుద‌లై అనూహ్యంగా బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల సునామీని సృష్టించింది. ఉత్త‌రాదిలో ఏకంగా 100 కోట్ల మైలు రాయిని అధిగ‌మించి సినీ ప్రియుల‌తో పాటు బాలీవుడ్ ట్రేడ్ పండితుల్ని షాక్ కు గురిచేసింది. ఈ మూవీ విడుద‌లై నేటికి 50 రోజులు పూర్త‌య్యాయి. అయినా దీని జోరు ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. బాక్సాఫీస్ వ‌ద్ద అదే జోరుని చూపిస్తూ త‌గ్గేదిలే అనే స్థాయిలో వ‌సూల్ల‌ని రాబ‌డుతోంది.

ఇటీవ‌ల అమెజాన్ ప్రైమ్ లో విడుద‌లైనా `పుష్ప‌` జోరు ఏ మాత్రం త‌గ్గ‌లేదు. అదే స్పీడుతో దూసుకుపోతూ అంత‌కు మించిన క్రేజ్ ని సొంతం చేసుకుంది. ఒక విధంగా చెప్పాలంటే ఈ మూవీ విడుద‌లైన ద‌గ్గ‌రి నుంచి ఏ చోట విన్నా ఒక‌టే మాట `పుష్ప‌.. పుష్ప‌..పుష్ప‌.. క్రికెట‌ర్లు.. క్రేజీ స్టార్లు.. టిక్ టాక్ స్టార్లు సైతం ఈ సినిమాకు ప్ర‌చార క‌ర్త‌లుగా మార‌డంతో దీని క్రేజ్ తారా స్థాయికి చేరింది.

ఏ స్టార్ హీరో సినిమాకు ద‌క్క‌ని క్రేజ్ బ‌న్నీ `పుష్ప‌`కు ద‌క్క‌డం.. ఏకంగా మ‌న దేశ స్టార్ క్రికెట‌ర్ల‌తో పాటు ఇత‌ర దేశాల‌కు చెందిన క్రికెట‌ర్లు, బాలీవుడ్ స్టార్లు కూడా ఈ చిత్ర పాట‌ల‌ని, పుష్ప సిగ్రేచ‌ర్ స్టెప్ ని, డైలాగ్ ని రీక్రియేట్ చేస్తూ పోస్ట్ చేసిన వీడియోలు నెట్టింట వైర‌ల్ గా మారి సినిమాకు మ‌రింత ప్ర‌చారాన్ని, క్రేజ్ ని తీసుకొచ్చాయి.

దీంతో సెకండ్ వేవ్ ముగిసిన త‌రువాత అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన ఇండియన్ సినిమాగా రికార్డుని సొంతం చేసుకుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 50 రోజులు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఇప్ప‌టి వ‌ర‌కు 365 కోట్లు వ‌సూలు చేసి స‌రికొత్త రికార్డుని సృష్టించింది. అల్లు అర్జున్ వ‌న్ మ్యాన్ షోగా థియేట‌ర్ల‌లో సంద‌డి చేసిన ఈ మూవీ బ‌న్నీ క్రేజ్ కి త‌గ్గ‌ట్టే సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి పాన్ ఇండియా స్టార్ ల జాబితాలో చేర్చింది. ఫ‌స్ట్ పార్ట్ ఊహించ‌ని స్థాయిలో వ‌సూళ్లుని రాబ‌ట్ట‌డంతో `పుష్ప 2` పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌ని దృష్టిలో పెట్టుకుని భారీ మార్పుల‌తో ఈ చిత్రాన్ని తెర‌పైకి తీసుకురాబోతున్నారు. పార్ట్ 2 షూటింగ్ త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంది.