Begin typing your search above and press return to search.

'పుష్ప‌' 2 ఆ టైమ్‌ కి రావ‌డం క‌ష్ట‌మే

By:  Tupaki Desk   |   8 Jan 2022 11:30 AM GMT
పుష్ప‌ 2 ఆ టైమ్‌ కి రావ‌డం క‌ష్ట‌మే
X
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తొలి పాన్ ఇండియా మూవీ `పుష్ప ది రైజ్‌`. సుకుమార్ డైరెక్ష‌న్‌ లో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఈ మూవీ ద‌క్షిణాది తో పాటు ఉత్త‌రాదిలోనూ బాక్సాఫీస్ లెక్క‌ల్ని మారుస్తూ దుమ్ము దులిపేస్తోంది. క‌నీవినీ ఎరుగ‌ని స్థాయిలో వ‌సూళ్ల‌ని రావ‌బ‌డుతూ స‌రికొత్త రికార్డులు సృష్టిస్తోంది. డిసెంబ‌ర్ 17న తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ, హిందీ భాష‌ల్లో విడుద‌లైన `పుష్ప‌` పేరుకు త‌గ్గ‌ట్టే రోజు రోజుకీ రైజ్ అవుతూ ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది.

ఇక ఈ మూవీ హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ 70 కోట్ల మైలు రాయిని దాట‌డం ఇప్ప‌డు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. బ‌న్నీ న‌టించిన గ‌త చిత్రాలు హిందీలో పాపుల‌ర్ కావ‌డం బ‌న్నీ ఉత్త‌రాది ప్రేక్ష‌కుల‌కు చేరువ కావ‌డంతో `పుష్ప‌` హిందీ వెర్ష‌న్ ఇప్పుడు అద్భుతాలు సృష్టిస్తోంది. ఆ కార‌ణంగానే జ‌న‌వ‌రి 7న ఈ మూవీ ని హిందీ వెర్ష‌న్ మిన‌హాయించి మిగ‌త నాలుగు భాష‌ల్లో ఓటీటీలో విడుద‌ల చేశారు. అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తాన్ని చెల్లించి ఈ నాలుగు భాష‌ల స్ట్రీమింగ్ హ‌క్కుల్ని సొంతం చేసుకుంది.

డిజిట‌ల్ వెర్ష‌న్ లో సినిమాలో వాడ‌ని కొన్ని స‌న్ని వేశాల‌ని యాడ్ చేశారిన తెలుస్తోంది. అంతే కాకుండా స‌మంత న‌టించి `ఊ అంటావా ఊఊ అంటావా..` స్పెష‌ల్ సాంగ్ లోని కొన్ని హాట్ స్టెప్స్ ని ఓటీటీ వెర్ష‌న్ కు యాడ్ చేశార‌ట‌. దీంతో ఓటీటీలో `పుష్ప‌`ని చూసేందుకు వీవ‌ర్స్ ఎగ‌బ‌డుతున్నారు. ఇదిలా వుంటే ఈ మూవీ పార్ట్ 2పై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. పార్ట్1కి వ‌చ్చిన టాక్ ని దృష్టిలో పెట్టుకుని పార్ట్ 2ని మ‌రింత ప‌వ‌ర్‌ఫుల్ గా మార్చాబోతున్నార‌ట‌.

పెళ్లి స‌న్నివేశాల‌తో పార్ట్ 1కి ఎండ్ కార్డ్ వేసేసిన సుకుమార్ పార్ట్ 2న మ‌రింత ఎఫెక్టీవ్‌గా తెర‌పైకి తీసుకురాబోతున్నార‌ట‌. ఇందు కోసం ముందు అనుకున్న స్క్రిప్ట్ మార్పులు చేయ‌బోతున్నార‌ని తెలుస్తోంది. మార్చి వ‌ర‌కు స్క్రిప్ట్ ప‌నులు పూర్తి చేసి మూవీని స్టార్ట్ చేయాల‌ని సుకుమార్‌, బ‌న్నీ ఇప్ప‌టికే ప్లాన్ ని సిద్ధం చేసుకున్నార‌ని ఇండస్ట్రీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

అయితే బ‌న్నీ పార్ట్ 2ని ఫాస్ట్ గా పూర్తి చేసి డిసెంబ‌ర్ లో రిలీజ్ చేయాల‌ని సుకుమార్ కి కండీష‌న్ పెట్టార‌ట‌. అయితే తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో ఈ ప్లాన్ ప‌ర్‌ఫెక్ట్ గా అమ‌లు కావ‌డం క‌ష్టం అని చెబుతున్నారు. దీంతో `పుష్ప 2` 2022లో విడుద‌ల‌య్యే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. పార్ట్ 1 ని అడ‌వుల్లో చేసిన‌ట్టుగా కాకుండా పార్ట్ 2ని మాత్రం అత్య‌ధిక భాగం స్టూడియోల్లో వేసిన సెట్ ల‌లోనే పూర్తి చేయాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

అడ‌వుల్లో కాకుండా స్టూడియోల్లో ప్లాన్ చేస్తే ఆ ఫీల్ వ‌స్తుందా? అన్న‌ది ఇప్ప‌డు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పార్ట్ 1లో ఫహ‌ద్ ఫాజిల్‌, అన‌సూయ‌ల పాత్ర‌ల‌కు పెద్ద‌గా స్కోప్ లేదు. కానీ పార్ట్ 2లో వారిదే హ‌వా అని క‌థ‌ని మొత్తం న‌డిపించేది వారే అని తెలుస్తోంది. ప‌గ‌తో ర‌గిలిపోయే యువ‌తిగా అన‌సూయ‌, అవ‌మానంతో పంతం ప‌ట్టిన పోలీస్ అధికారిగా ఫహ‌ద్ ఫాజిల్ పాత్ర‌లు మ‌రింత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌నున్నాయ‌ట‌. ఇక బ‌న్నీ, ర‌ష్మిక ల పాత్ర‌ల మ‌ధ్య స‌ర‌సాలు, పెళ్లి త‌రువాత ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగే రొమాన్స్ ప్ర‌ధానంగా సాగుతుంద‌ని తెలుస్తోంది.